ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kesineni Chinni: వంశీపై కేశినేని చిన్ని సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-02-21T14:31:41+05:30

వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై టీడీపీ నేత కేశినేని చిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (YCP MLA Vallabhaneni Vamsi)పై టీడీపీ నేత కేశినేని చిన్ని (TDP Leader Kesineni Chinni) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వంశీ (Vamsi) కి ఓటమి భయం పట్టుకుందన్నారు. ఓటమి భయంతోనే వంశీ గన్నవరం పార్టీ కార్యాలయం (Gannavaram TDP Office)పై దాడి చేశారని ఆరోపించారు. వంశీ, కొడాలి నాని విష పురుగులంటూ వ్యాఖ్యలు చేశారు. వంశీకి దమ్ముంటే టీడీపీ (TDP) వల్ల వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సారి గన్నవరం, గుడివాడలో గెలిచేది టీడీపీనే అని... టీడీపీ గెలుపును ఎవరూ అపలేరని కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేశారు.

కొద్దిసేపటి క్రితమే టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి (Kommareddy Pattabhi) సతీమణి చందన (Chandana)ను టీడీపీ నేతలు కేశినేని చిన్ని, ఆచంట సునీత పరామర్శించారు. ధైర్యంగా ఉండాలి అని చందనకు చిన్ని సూచించారు. పార్టీతో పాటు తాము అంతా అండగా ఉంటామని కేశినేని చిన్ని హామీ ఇచ్చారు.

మరోవైపు తన భర్త పట్టాభి గురించి చెప్పాలని లేదంటే డీజీపీ (DGP) ఆఫీస్ వద్ద దీక్ష చేస్తానంటూ ఇంటి నుంచి బయలుదేరిన చందనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇంటి నుంచి బయల్దేరిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. తన భర్త నిన్న సాయంత్రం నుంచి కనబడటం లేదంటూ చందన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘పట్టాభిని ఎవరు తీసుకెళ్ళారో తెలీదు. నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అరగంట సమయంలో నా భర్త పట్టాభి ఎక్కడున్నాడో నాకు తెలియాలి. లేనిపక్షంలో డీజీపీ ఇంటి ముందు నిరాహారదీక్ష చేస్తా. నా కూతురు రాత్రి నుంచి నాన్న ఇంటికి రాలేదని భయపడుతోంది’’ అని తెలిపారు.

అయితే.. నిన్న సాయంత్రం నుంచి తన భర్త పట్టాభి కనిపించడం లేదని భార్య చంద రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గన్నవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సి ఉండగా.. పోలీసులు గన్నవరం వెళ్ళనివ్వడం లేదు కాబట్టి ఇంటి దగ్గర పడమట సీఐ కాశీ విశ్వనాధ్‌కు చందన ఫిర్యాదు లెటర్ అందజేశారు.

Updated Date - 2023-02-21T14:31:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising