ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kollu Ravindra: మచిలీపట్నాన్ని హోల్‌సేల్‌గా లూటీ చేసేందుకు నాని కుట్ర

ABN, First Publish Date - 2023-04-26T14:08:49+05:30

మచిలీపట్నాన్ని హోల్ సేల్‌గా లూటీ చేసేందుకు పేర్ని నాని కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: మచిలీపట్నాన్ని హోల్ సేల్‌గా లూటీ చేసేందుకు పేర్ని నాని (Perni nani) కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర (Former Minister Kollu Ravindra) విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఆ నాడు భవిష్యత్తుతరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మచిలీపట్నం అర్బన్ డెవల్ప్మెంట్ అధారిటీ (ముడా)ని ఏర్పాటు చేశామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముడా సంస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. తాజాగా ముడా అధికారులు తయారు చేసిన మాస్టర్ ప్లాన్‌పై ఎన్నో తప్పులు దొర్లాయన్నారు. మల్టీ పర్పస్ జోన్లు లేకుండా 90% రెసిడెన్షియల్ జోన్‌గా మార్చారని.. దీని వల్ల భవిష్యత్తు తరాలకు తీరని నష్టం ఏర్పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

మాస్టర్ ప్లాన్ తయారీ అంతా లోపభూయిష్టంగా ఉందని వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ ఆస్తులను దోచుకునేలా మాస్టర్ ప్లాన్‌ను తయారు చేశారని మండిపడ్డారు. గుడి, బడిని కూడా దోచుకునేలా మాస్టర్ ప్లాన్ ఉందన్నారు. వైసీపీ నేతల సొంత ఆస్తులను కమర్షియల్ జోన్‌లో పెట్టుకున్నారని తెలిపారు. తాగునీటి అవసరాలను ఏ విధంగా తీరుస్తారో మాస్టర్ ప్లాన్‌లో చెప్పలేదన్నారు. ఇప్పటికైనా ప్రజలు కళ్లు తెరవాలని.. లోపభూయిష్టంగా ఉన్న మాస్టర్ ప్లాన్‌పై అభ్యంతరాలు తెలియజేయాలని కోరారు. మే 9 లోపు అభ్యంతరాలకు ప్రభుత్వం గడువు ఇచ్చిందన్నారు. ఈ లోపు ప్రతి ఒక్కరూ అభ్యంతరాలు తెలపాలని అన్నారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

Updated Date - 2023-04-26T14:08:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising