ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kollu Ravindra: రూ.300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకే పేర్నినాని ప్లాన్..

ABN, First Publish Date - 2023-02-07T13:14:42+05:30

కృష్ణా జిల్లా: వైసీపీ కార్యాలయం పేరుతో 5.40 ఎకరాల ప్రభుత్వ భూమిని‌ దోపిడీ చేసేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా జిల్లా: వైసీపీ కార్యాలయం (YCP Office) పేరుతో 5.40 ఎకరాల ప్రభుత్వ భూమిని‌ దోపిడీ చేసేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) ఆరోపించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రూ.300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు పేర్నినాని ప్లాన్ (Perni Nani plan) చేస్తున్నారని అన్నారు. ఎవడబ్బ సొమ్మని ప్రజల ఆస్తిని పార్టీ ఆఫీస్‌కి ఇస్తారని ప్రశ్నించారు. అది ‘నీ కష్టమా, నీ తండ్రి కష్టమా’.. పేర్నినాని చెప్పాలన్నారు. భూ రికార్డులు మార్చిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకుంటారని, రిటైర్ అయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ఆస్తుల రక్షణ కోసం తాము పోరాడుతామని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

ఆ భూమి ఏపీ పోలీసుల క్వార్టర్స్‌దని మాస్టర్ ప్లాన్‌లో ఉందని, ఆ భూమి పోతున్నా... ఆస్తిని కాపాడుకోలేరా? అని కొల్లు రవీంధ్ర అన్నారు. విలువైన భూమిని కొట్టస్తే... అధికారులు లంచాల కోసం సహకరిస్తున్నారా? అంటూ మండిపడ్డారు. అవసరం అయితే ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు. పోలీసుల ఆస్తి కోసం తాము పోరాటం చేస్తుంటే.. తిరిగి మాపైనే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. ఈ విషయంపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. అధికారులు చట్ట బద్దంగా, న్యాయ బద్దంగా పని‌‌చేయాలని కొల్లు రవీంధ్ర సూచించారు.

మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు

టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ భూమిని రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఆఫీసులకు వాడుకున్నారని ఆరోపించారు. అడ్డగోలుగా ప్రభుత్వ జీవోలను విడుదల చేస్తూ భూములు పార్టీకి ధారధక్తం చేశారన్నారు. అక్రమ మార్గంలో అడ్డగోలుగా ఎదగాలని ఉద్దేశంతో కొల్లు రవీంద్ర పోలీసులపైనే చేయి చేసుకున్నారని, కావాలనే కేసులు పెట్టించుకుని పబ్లిసిటీ కోసం ప్రయత్నించారని విమర్శించారు. గతంలో సినిమా వ్యక్తులను తీసుకువచ్చి సంబరాల రాంబాబుగా పేరుపొందారన్నారు. దిగజారుడు రాజకీయాలు‌ చేసే వ్యక్తి కొల్లు రవీంద్ర అంటూ పేర్ని నాని అన్నారు. దీనిపై స్పందించిన కొల్లు రవీంధ్ర మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-02-07T13:14:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising