Pattabhi: కక్షతోనే అమరావతిని నాశనం చేశారు
ABN, First Publish Date - 2023-08-12T14:35:57+05:30
గ్రామీణ ప్రాంతాల్లో పీఎంఏవై కింద కట్టిన ఇళ్లు ఎన్నో పార్లమెంట్‌లోనే చెప్పారు. మంత్రి జోగి రమేష్ లాంటి వారు ఉంటే ఫెర్ఫార్మెన్స్ ఇలానే ఉంటుంది. సీఎం జగన్, జోగి రమేష్‌లు జగనన్న కాలనీకి చర్చకు రండి . 4 సంవత్సరాల్లో పూర్తి చేసిన ఇళ్లు 9631 మాత్రమే. వైఎస్సార్ కడప జిల్లాలో ఆప్షన్ 3 కింద వేల సంఖ్యలో దరఖాస్తులు పెడితే పూర్తి చేసినవి 37 మాత్రమే.
విజయవాడ: ముఖ్యమంత్రి జగన్ అమరావతిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో పీఎంఏవై కింద కట్టిన ఇళ్లు ఎన్నో పార్లమెంట్‌లోనే చెప్పారు. మంత్రి జోగి రమేష్ లాంటి వారు ఉంటే ఫెర్ఫార్మెన్స్ ఇలానే ఉంటుంది. సీఎం జగన్, జోగి రమేష్‌లు జగనన్న కాలనీకి చర్చకు రండి . 4 సంవత్సరాల్లో పూర్తి చేసిన ఇళ్లు 9631 మాత్రమే. వైఎస్సార్ కడప జిల్లాలో ఆప్షన్ 3 కింద వేల సంఖ్యలో దరఖాస్తులు పెడితే పూర్తి చేసినవి 37 మాత్రమే. ఇళ్ల నిర్మాణం జగన్ హయాంలోనే ప్రారంభం అయినట్టు చెప్పారు. అమరావతి విషయంలో ఐఐటీ మద్రాస్ రిపోర్ట్‌ను సైతం ఫోర్జరీ చేశారు. అమరావతి ప్రజల రాజధాని.. అందుకే ప్రతి ఒక్కరికీ స్థానం ఉంటుంది అని ఎప్పుడో చెప్పారు. అమరావతిలో అర్ 3 జోన్ అతి ముఖ్యమైనది. అర్ 3 జోన్‌లో మిగిలి ఉన్న భూమిలో ఎకరానికి 114 మందికి ఇల్లు నిర్మించారు. కొత్తగా అర్ 5 జోన్ అని ఇంకా అనేక జోన్‌లను నాశనం చేశారు.’’ అంటూ పట్టాభి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
Updated Date - 2023-08-12T14:35:57+05:30 IST