ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pattabhi Ram: లక్షలాది మందికి ఉపాధి కల్పించిన నేతను జైల్లో పెడతారా?

ABN, First Publish Date - 2023-09-19T15:44:59+05:30

ఏపీఎస్ఎస్‌డీసీ ఏర్పాటు సక్రమం కాదని సీఐడీ అధికారులు (CID) దుష్ప్రచారం చేస్తున్నారు. ఏపీఎస్ఎస్‌డీసీ ఏర్పాటు సక్రమమే అన్న వాస్తవాలను ప్రజల ముందుంచుతున్నాం. జగన్ మోహన్ రెడ్డికి (CM jagan) అత్యంత ఆప్తురాలైన నీలం సహాని 10.09.2014న జీ.వో నం. 47 ను విడుదల చేసి

అమరావతి: లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి కుటుంబాలను నిలబెట్టిన నేతను అక్రమంగా జైల్లో పెడుతారా? అంటూ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Pattabhi Ram) నిలదీశారు. ఆయన మీడియాతో మాట్లారు. ‘‘ఏపీఎస్ఎస్‌డీసీ ఏర్పాటు సక్రమం కాదని సీఐడీ అధికారులు (CID) దుష్ప్రచారం చేస్తున్నారు. ఏపీఎస్ఎస్‌డీసీ ఏర్పాటు సక్రమమే అన్న వాస్తవాలను ప్రజల ముందుంచుతున్నాం. జగన్ మోహన్ రెడ్డికి (CM jagan) అత్యంత ఆప్తురాలైన నీలం సహాని 10.09.2014న జీ.వో నం. 47 ను విడుదల చేసి ఏపీఎస్ఎస్‌డీసీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభజనానంతరం ఆర్థికంగా నష్టపోయిన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీయించేందకు పరిశ్రమల స్థాపనకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చే సంస్థ అవసరమని ఆమె జీవోలో పేర్కొన్నారు. జాతీయ నైపుణ్యాభివృద్ధికి శిక్షణా (NSDC) సంస్థ ఏర్పాటు తరహాలో ఏపీఎస్ఎస్‌డీసీ ఏర్పాటు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. 27.09.2014న జీవో.నెం. 48 విడుదల చేస్తూ... మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్‌ను ఆమోదించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వారు ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటును దృవీకరిస్తూ... 7.10.2014న సర్టిఫికేట్ ఇచ్చారు.ఈ జీవోలు, డాక్యుమెంట్లకు సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ ఏం సమాధానం చెబుతారు? చంద్రబాబు ప్రభుత్వం రూల్స్‌కు అనుగుణంగానే ఏపీఎస్ఎస్‌డీసీను ఏర్పాటు చేసిందినడానికి ఈ రెండు జీవోలు ప్రత్యక్ష సాక్ష్యం. ఏపీఎస్ఎస్‌డీసీ ఏర్పాటుపై నాటి జీవోలు ఇచ్చిన ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నీలం సహాని పిలిచి అడిగితే మీకు కావాల్సిన సమాధానాలు దొరుకుతాయి.’’ అని తెలిపారు.

‘‘ఏపీఎస్ఎస్‌డీసీ ఏర్పాటుకు కావాల్సిన నిధులను మంజూరు చేసిన నాటి ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌కు అధిపతిగా వ్యవహరించిన అజేయ కల్లం రెడ్డిని ఎందుకు ప్రశ్నించడం లేదు?, నియమనిబంధనలకు అనుగుణంగా ఏపీఎస్ఎస్‌డీసీ ఏర్పాటు జరిగిందనడానికి ఇవి సాక్ష్యాలు కావా?, నారా చంద్రబాబు నిబద్దతకు ఇవి ఆధారాలు కాదా?, లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి కుటుంబాలను నిలబెట్టిన నేతను అక్రమంగా జైల్లో పెడుతారా?, ఈ డాక్యుమెంట్లు తప్పని రుజువు చేసే దమ్ము సీఐడీకి, ప్రభుత్వానికి ఉందా?, జూన్ 8, 2014న చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణం నుంచి రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేశారనడానికి ఏపీఎస్ఎస్‌డీసీ ఏర్పాటు ఒక ఉదాహరణ. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలో ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇసుక రద్దు చేసి కార్మికులను రోడ్డున పడేశారు, ప్రజావేదిక కూల్చారు. వీరిద్దరి మధ్య తేడాను ప్రజలు గమనించుకోవాలి. అభివృద్ధి నిర్మాత చంద్రబాబైతే... అభివృద్ధి విధ్వంసకుడు జగన్‌రెడ్డి. జగన్‌రెడ్డి ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. తప్పుడు సమాచారం ప్రచారం చేయడానికి ఢిల్లీ వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టిన సీఐడీ చీఫ్ చంద్రమండలానికి వెళ్లి పత్రికా సమావేశం పెట్టినా ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరు.’’ అని పట్టాభి పేర్కొన్నారు.

Updated Date - 2023-09-19T15:44:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising