ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP: గ్రూప్-1కు 85 రోజులే గడువు సరికాదన్న టీడీపీ ఎమ్మెల్సీ

ABN, First Publish Date - 2023-03-27T09:59:03+05:30

గ్రూప్‌-1 కు 85 రోజుల గడువు ఇస్తూ ఏపీపీఎస్సీ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌ బాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: గ్రూప్‌-1 కు 85 రోజుల గడువు ఇస్తూ ఏపీపీఎస్సీ (APPSC) తీసుకున్న నిర్ణయంపై టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌ బాబు (TDP MLC Ashokbabu) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి నిరుద్యోగుల అభ్యున్నతికి, ఉన్నతికి నిర్ణయాలు తీసుకొవాల్సిన ఏపీపీఎస్సీ వారిని రోడ్డున పడేసేలా వ్యవహరిస్తోందన్నారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 85 రోజులే గడువు ఇవ్వడం సరికాదన్నారు. నిరుద్యోగుల జీవితాలతో చేలగాటమాడేలా ఏపీపీఎస్సీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 85 రోజుల్లో మెయిన్స్ పరీక్షకు ఏవిధంగా సిద్ధమవుతారని ఏ సలహాదారుడు చెప్పారని ప్రశ్నించారు. కనీసం మరో 3 నెలల సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాదయాత్రలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పారని విమర్శించారు. అనర్హులకు, అసమర్థులకు అధికారం ఇస్తే గత నాలుగేళ్లలో ఏమి జరిగిందో మళ్లీ అదే జరుగుతుందని గ్రహించాలన్నారు. నిరుద్యోగుల ఆగ్రహనికి గురవడం ఖాయమని పరుచూరి అశోక్ బాబు స్పష్టం చేశారు.

Updated Date - 2023-03-27T09:59:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising