ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

High Court: ‘వ్యూహం’ సినిమాపై టీఎస్ హైకోర్టులో విచారణ

ABN, Publish Date - Dec 26 , 2023 | 11:32 AM

హైదరాబాద్: రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మించిన ‘వ్యూహం’ సినిమాపై మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

హైదరాబాద్: రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మించిన ‘వ్యూహం’ సినిమాపై మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ సినిమా ఈనెల 29న విడుదల కావాల్సి ఉంది. దీనిపై న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మ రూపొందించిన ‘వ్యూహం’ సినిమా విడుదల నిలిచిపోయింది. ఈ సినిమాపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు.. సినిమా విడుదలను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఓటీటీ, ఆన్‌లైన్‌, ఇంటర్నెట్‌, థియేటర్‌ సహా మరే వేదికల్లోనూ దీనిని విడుదల చేయరాదని ఆదేశించింది. దర్శకుడు రాంగోపాల్‌వర్మ.. తెలుగుదేశం పార్టీని, తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేలా, తమ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సినిమా తీశారని పిటిషన్‌లో లోకేశ్‌ పేర్కొన్నారు. తరఫు న్యాయవాది ఉన్నం మురళీధర్‌ వాదనలు వినిపిస్తూ.. వ్యూహం సినిమాలో పిటిషనర్‌ కుటుంబ సభ్యులు, పార్టీకి సంబంధించి అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని, సినిమాను విడుదల చేస్తే పిటిషనర్‌ హక్కులకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. దీనిని విచారించిన సిటీ సివిల్‌ కోర్టు రెండో అడిషనల్‌ చీఫ్‌ జడ్జి సినిమా విడుదలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతివాదులైన రామదూత క్రియేషన్స్‌ సంస్థ, నిర్మాత దాసరి కిరణ్‌ తదితరులకు సమన్లు జారీచేశారు. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు.

మరోవైపు ‘వ్యూహం’ సినిమాకు సెన్సార్‌ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ నారా లోకేశ్‌.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీని, పార్టీ అధినేత చంద్రబాబును అప్రతిష్ఠపాలు చేసేందుకు ఈ సినిమా తీశారని తెలిపారు. సినిమాటోగ్రఫీ చట్టం 1952, సెక్షన్‌-5 (బీ), 1991లో జారీ చేసిన రివైజ్డ్‌ గైడ్‌లైన్స్‌, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 21, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఈ సినిమాకు సర్టిఫికెట్‌ జారీ చేశారని పేర్కొన్నారు.

రాంగోపాల్‌వర్మ ఇష్టానుసారంగా తీశారు..

దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఇష్టానుసారంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్ఠకు, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా దురుద్దేశంతో వ్యూహం సినిమాలో పాత్రలు రూపొందించారని, పాత్రలను తప్పుడు కోణాల్లో చిత్రీకరించారని తెలిపారు. ఇది తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనన్నారు. రివైజింగ్‌ కమిటీ, రామదూత క్రియేషన్స్‌, నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌, దర్శకుడు రాంగోపాల్‌వర్మలను ప్రతివాదులుగా చేర్చారు. దీంతో ఈ పిటిషన్‌ ఈరోజు విచారణ జరగనుంది.

Updated Date - Dec 26 , 2023 | 11:32 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising