Chandrababu ACB Court: కోర్టు దగ్గర రెండు కాన్వాయ్‌లు ఏర్పాటు.. టీడీపీ అధిష్టానం ఆరా
ABN, First Publish Date - 2023-09-10T17:45:51+05:30
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు తీర్పుపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. మధ్యాహ్నం 2:30కే ఇరువర్గాల వాదనలు ముగిసినా.. ఇప్పటి వరకూ ఎలాంటి తీర్పు వెలువరించకపోవడంతో ఈ పరిణామంపై తెలుగు ప్రజల్లో సర్వత్రా టెన్షన్ వాతావరణం నెలకొంది. అసలేం జరుగుతోంది అన్న
విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు తీర్పుపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. మధ్యాహ్నం 2:30కే ఇరువర్గాల వాదనలు ముగిసినా.. ఇప్పటి వరకూ ఎలాంటి తీర్పు వెలువరించకపోవడంతో ఈ పరిణామంపై తెలుగు ప్రజల్లో సర్వత్రా టెన్షన్ వాతావరణం నెలకొంది. అసలేం జరుగుతోంది అన్న ఉత్కంఠ చోటుచేసుకుంది. మరోవైపేమో కోర్టు పరిసరాల్లో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆ పరిసరాలకు ఎవర్నీ రానివ్వడం లేదు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా విజయసంకేతం ఎగరేశారు. అంటే చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు రాబోతోందని తెలుగు దేశం శ్రేణులు భావిస్తున్నారు. ఇంకో వైపు తీర్పు ఎందుకు ఆలస్యం అవుతుందన్న ఉత్కంఠ చోటుచేసుకుంది. ఈ పరిణామాలను వీక్షిస్తున్న వారిలో ఒకరకమైన గుబులు నెలకొంది.
ఇదిలా ఉంటే విజయవాడ కోర్టు దగ్గరకు రెండు కాన్వాయ్‌లను పోలీసులు సిద్ధం చేశారు. ఒక కాన్వాయ్ నిత్యం చంద్రబాబు ఉపయోగించేది అయితే.. రెండోది పోలీసులు ఏర్పాటు చేశారు. రెండు కాన్వాయ్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రెండు కాన్వాయ్‌లు ఏర్పాటు చేయడంపై టీడీపీ అగ్రనేతలంతా ఆరా తీస్తున్నారు.
Updated Date - 2023-09-10T17:52:30+05:30 IST