Share News

Vangaveeti Radha: తొలిసారిగా వంగవీటి రంగ వర్థంతి కార్యక్రమానికి హాజరుకాని రాధా

ABN , Publish Date - Dec 26 , 2023 | 10:37 AM

నేడు వంగవీటి రంగ వర్ధంతి. ఈ సందర్భంగా బెజవాడ బందరు రోడ్డులో ఉన్న రంగా విగ్రహానికి పూలమాల వేసి రంగా కుమార్తె ఆశ, రాధా భార్య పుష్పవల్లి నివాళి అర్పించారు. కార్యక్రమంలో వంగవీటి రాధ పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Vangaveeti Radha: తొలిసారిగా వంగవీటి రంగ వర్థంతి కార్యక్రమానికి హాజరుకాని రాధా

విజయవాడ: నేడు వంగవీటి రంగ వర్ధంతి. ఈ సందర్భంగా బెజవాడ బందరు రోడ్డులో ఉన్న రంగా విగ్రహానికి పూలమాల వేసి రంగా కుమార్తె ఆశ, రాధా భార్య పుష్పవల్లి నివాళి అర్పించారు. కార్యక్రమంలో వంగవీటి రాధ పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాశీలో రంగా తర్పణంలో పాల్గొనటం కారణంగా రాధా రాలేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ సందర్భంగా వంగవీటి ఆశ మాట్లాడుతూ.. వంగవీటి రాధ కాశీలో రంగా వర్థంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. రంగా అభిమానులంతా తమ‌ కుటుంబ సభ్యులే‌నన్నారు. వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు రంగా వర్ధంతి కాబట్టి.. రాజకీయాలు మాట్లాడడం సరికాదని ఆశ పేర్కొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 12:01 PM