ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: విజయవాడ-విశాఖ మధ్య నిలిచిన రైళ్ల రాకపోకలు

ABN, First Publish Date - 2023-04-18T15:11:00+05:30

విజయవాడ (Vijayawada)-విశాఖ (Visakha) మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. నిడదవోలు (Nidadavolu) రైల్వే జంక్షన్ (Railway Junction) సమీపంలో ఎల్‌సి 383 (Lc 383) వద్ద పవర్ బ్రేక్ (Power Break) అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా జిల్లా: విజయవాడ (Vijayawada)-విశాఖ (Visakha) మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. నిడదవోలు (Nidadavolu) రైల్వే జంక్షన్ (Railway Junction) సమీపంలో ఎల్‌సి 383 (Lc 383) వద్ద పవర్ బ్రేక్ (Power Break) అయింది. రైల్వే ట్రాక్‌పై నుంచి వెళుతున్న 11 కెవి విద్యుత్ లైన్ తెగి రైల్వే ఓహెచ్ఈ (OHE)పై పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో సమీపంలో నిలిచిన గూడ్స్ రైలు, రాజమండ్రి వైపు వచ్చే రైళ్లను ఎక్కడికక్కడ రైల్వే అధికారులు నిలిపివేస్తున్నారు.

సమాచారం అందుకున్న టీఆర్‌డీ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ లైన్ మరమ్మతులు చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం 12.10 గంటల నుంచి రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పునరుద్ధరణకు మరో మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

కాగా రాజమండ్రి నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్ల రాకపోకలను రైల్వే అధికారులు పునరుద్ధరించారు. అయితే విజయవాడ వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్లే రైళ్లు ఇంకా అలాగే నిలిచిపోయాయి. మూడు గంటలు ఆలస్యంగా రైళ్లు నడుస్తున్నాయి.

Updated Date - 2023-04-18T15:16:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising