ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kesineni Nani: ‘ధనిక సీఎం జగన్ ఏపీని పేద రాష్ట్రంగా మార్చారు’

ABN, First Publish Date - 2023-04-15T15:21:38+05:30

దేశంలోనే అత్యధిక ధనవంతుడైన సీఎం జగన్మోహనరెడ్డి రాష్ట్రాన్ని అత్యంత పేద రాష్ట్రంగా మార్చిన ఘనత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: దేశంలోనే అత్యధిక ధనవంతుడైన సీఎం జగన్మోహనరెడ్డి (CM Jaganmohan Reddy) రాష్ట్రాన్ని అత్యంత పేద రాష్ట్రంగా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందని విజయవాడ ఎంపీ కేశినేని నాని (Vijayawada MP Kesineni Nani) అన్నారు. శనివారం తిరువూరులో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ.. ఆపైమీడియాతో మాట్లాడుతూ... ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారన్నారు. ఏపీని గంజాయి రాష్ట్రంగా మార్చిన ఘనత కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని ఎద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యే రక్షణ నిధి తిరువూరు నియోజవర్గానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఎన్నిలక ముందు జగన్ తిరువూరుకు ఇచ్చిన హామీలను మొన్నటి సభలో ఎమ్మెల్యే చదివి వినిపించారని విమర్శించారు.

‘‘రక్షణ నిధి నన్ను అడిగితే తన ఎంపీ నిధుల నుండి గ్రాంట్ క్రింద ప్రతి సంవత్సరం తిరువూరు నియోజకవర్గానికి కావలసిన నిధులు 4 కోట్ల 90 లక్షలు మంజూరు చేసేవాడినని, జగన్ అసమర్థత పాలన వలన రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది’’ అంటూ విమర్శించారు. అమరావతిని నాశనం చేయటానికి జగన్ కంకణం కట్టుకున్నాడని వచ్చేది చంద్రబాబు ప్రభుత్వం అని, అభివృద్ధి అంటే గతంలో చేశాం మరలా చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. తన ఎంపీ నిధుల ద్వారా నియోజకవర్గంలో అనేక గ్రామాలకు ట్యాంకుల ద్వారా ఉచిత మంచి నీటి సరఫరా, కిడ్నీ బాధితుల కోసం కూడా నిధులు విడుదల చేశానని ఎమ్మెల్యేకు నాని గుర్తుచేశారు. అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక అందజేశావా అంటూ ఎమ్మెల్యే రక్షణ నిధిని ఎంపీ కేశినేని ప్రశ్నించారు.

Updated Date - 2023-04-15T15:21:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising