Sajjala: ఈసారి కూడా పవన్ రిమోట్ చంద్రబాబు చేతుల్లోనే...
ABN, First Publish Date - 2023-01-26T13:19:36+05:30
సబ్‌ప్లాన్ నిధులు దుర్వినియోగం అంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ ఆధారాలతో అంటున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
అమరావతి: సబ్‌ప్లాన్ నిధులు దుర్వినియోగం అంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan)ఏ ఆధారాలతో అంటున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Government Advisor Sajjala Ramakrishna Reddy) ప్రశ్నించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గెస్ట్ ఆర్టిస్ట్‌లా వచ్చి చంద్రబాబు (TDP Chief Chandrababu naidu) ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్తారని విమర్శించారు. సబ్‌ప్లాన్ కంటే ఎక్కువగా నిధులు అందిస్తున్నామన్నారు. చంద్రబాబు ఐదేళ్లలో రూ. 33 వేల కోట్లు ఖర్చు చేశారని... జగన్ (AP CM Jaganmohan Reddy) మూడేళ్లలో రూ. 48 వేల కోట్లు నిధులు ఇచ్చారని చెప్పుకొచ్చారు. పొలిటికల్‌గా, పదవులు పరంగా ఎస్సీ, ఎస్టీలకు జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. సకల శాఖల మంత్రి అని పవన్ తనపై విష ప్రచారం చేస్తున్నారన్నారు. టార్గెట్‌గా చేసుకుని ప్రజల్లో ఏదో క్రియేట్ చెయ్యడానికి ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. పొత్తుల గురించి పవన్ చెప్పిన మూడు ఆప్షన్స్ నవ్వొస్తోందన్నారు. ఏమీ లేకుండా చంద్రబాబుకి సపోర్టు చెయ్యడం అనే నాలుగో ఆప్షన్ కూడా చెప్పాల్సింది అంటూ ఆయన యెద్దేవా చేశారు.
గత రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా పవన్ రిమోట్ చంద్రబాబు చేతుల్లోనే ఉంటుందన్నారు. లోకేష్ పాదయాత్రను టీడీపీ ఎక్కువగా ఊహించుకుంటోందన్నారు. జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఉన్న నిబంధనలే ఇప్పుడు ఉన్నాయని.. జగన్ ఆంక్షలకు లోబడే పాదయాత్ర చేశారని.. ఆంక్షలు పెట్టారని గగ్గోలు పెట్టలేదని గుర్తుచేశారు. కందుకూరు ఘటనతో రోడ్లపై సభలు నిషేధం నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. లోకేష్, పవన్, చంద్రబాబులలో సీఎం అభ్యర్థి ఎవరో ప్రజలకు చెప్పాలన్నారు. వైసీపీ అంటే జగన్.. జగన్ అంటే వైసీపీ అని తాము స్పష్టంగా ఉన్నామని... తమరెందుకు స్పష్టంగా చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. విడివిడిగా వచ్చినా.. కలిసి వచ్చినా తమకు ఓకే అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-01-26T13:43:04+05:30 IST