ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR: లోకేష్ ట్వీట్ చూసి బాధ అనిపించింది

ABN, First Publish Date - 2023-10-13T20:40:24+05:30

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) భద్రతపై టీడీపీ యువనేత నారా లోకేష్ చేసిన ట్వీట్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ ద్వారా స్పందించారు.

హైదరాబాద్: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) భద్రతపై టీడీపీ యువనేత నారా లోకేష్ చేసిన ట్వీట్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ ద్వారా స్పందించారు.


"ఉదయం లోకేష్ ట్వీట్ చూసి బాధ అనిపించింది. చంద్రబాబు భద్రత విషయంలో లోకేష్ వ్యక్తం చేసిన ఆందోళనను ఒక కొడుకుగా అర్థం చేసుకోగలను. లోకేష్ చెప్పింది వాస్తవం అయితే ఈ పరిస్థితి బాధాకరం. నాకు ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల నిజానిజాలు తెలియవు, కానీ ఆయన భద్రతకు ప్రమాదం అయితే రాజకీయాల్లో ఇది దురదృష్టకరం. లోకేష్ పరిస్ధితిని అర్ధం చేసుకోగలను. రాజకీయాలు వేరైనా ఆయన కుటుంబం బాధను నేను అర్ధం చేసుకోగలను. వారికి నా సానుభూతి. నిమ్స్ ఆసుపత్రిలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో ఆయన ఆరోగ్యంపై మేము కూడా చాలా ఆందోళన చెందాం. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి విషమించే ప్రమాదం పొంచి ఉందని ఇంటలిజెన్స్ అధికారులు మమ్మల్ని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇలాంటి సందర్భాల్లో ఏలాంటి మానసిక స్ధితి ఉంటుందో అర్ధం చేసుకోగలను. హైదరాబాద్ శాంత భద్రతలకు విఘాతం కలగవద్దన్న నేపథ్యంలోనే ఇక్కడ అందోళన చేయడం వద్దు అన్నాను. రెండు పార్టీల మధ్య ఉన్న రాజకీయాలలోకి తెలంగాణను లాగవద్దు అన్నాను." అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-10-13T20:44:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising