ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nandyala Dist.: వినూత్న రీతిలో సర్పంచుల నిరసన

ABN, First Publish Date - 2023-04-27T16:44:44+05:30

నంద్యాల జిల్లా: వైసీపీ పాలన (YCP Govt.)లో సమస్యలు పరిష్కారం కావడంలేదంటూ సర్పంచ్‌లు వినూత్నరీతి (Sarpanches Innovative)లో నిరసన (Protest) తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల జిల్లా: వైసీపీ పాలన (YCP Govt.)లో సమస్యలు పరిష్కారం కావడంలేదంటూ సర్పంచ్‌లు వినూత్నరీతి (Sarpanches Innovative)లో నిరసన (Protest) తెలిపారు. మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచులు సమస్యల పుట్టిన రోజు నిర్వహించారు. నంద్యాల జిల్లా, మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కావడంలేదంటూ సర్పంచులు సమావేశంలో కేక్ కట్ చేసి వినూత్నరీతిలో నిరసన తెలిపారు.

సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేసినా.. ఏడాది కాలంగా అవి పరిష్కారం కావడంలేదని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా తమ గ్రామాల్లో వాలంటీర్ల (Volunteers) పెత్తనం ఎక్కువగా ఉందని ఆరోపించారు. వాలంటీర్లు గౌరవించనప్పుడు ఎందుకు సర్పంచ్ పదవిలో ఉండాలని అధికారులను నిలదీశారు. వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలని వైసీపీ సర్పంచులే డిమాండ్ చేయడంతో అధికారులు అవాక్కయ్యారు.

Updated Date - 2023-04-27T16:44:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising