ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP: అరాచ‌క స‌ర్కార్‌పై ‘జ‌నజైత్ర‌యాత్ర‌’

ABN, First Publish Date - 2023-05-15T09:50:06+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర నేటితో వందవ రోజుకు చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara lokesh) యువ‌గ‌ళం పాద‌యాత్ర (Yuvagalam Padayatra) నేటితో వందవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వంద‌రోజుల విశేషాల‌తో టీడీపీ నేత కేశినేని శివ‌నాథ్ (చిన్ని) రూపొందించిన‌ ప్ర‌త్యేక సంచికను లోకేష్ ఆవిష్కరించారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర అరాచ‌క స‌ర్కారుపై జ‌న‌జైత్ర‌యాత్రగా చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌ని టీడీపీ నేత‌లు పేర్కొన్నారు. లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం వందరోజులు పూర్త‌యిన సంద‌ర్భంగా పాద‌యాత్ర విశేషాల‌తో కేశినేని శివ‌నాథ్(చిన్ని) ప్ర‌త్యేక సంచిక తీసుకొచ్చారు. శ్రీశైలం నియోజ‌క‌వ‌ర్గం బోయరేవుల క్యాంప్ సైట్ వ‌ద్ద సోమ‌వారం ఉదయం యువ‌నేత నారా లోకేష్ ప్ర‌త్యేక సంచిక ``జ‌న‌హృద‌య‌మైనారా లోకేష్‌``ని ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడు కాసాని జ్ఞానేశ్వ‌ర్, మాజీ మంత్రి రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, మాజీ మంత్రి పీత‌ల సుజాత‌, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి , శ్రీశైలం నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఇన్‌చార్జ్ బుడ్డా రాజ‌శేఖ‌ర్ రెడ్డి, టీడీపీ ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు ఎంఎస్ రాజు, దూండి రాకేష్, యువగళం మీడియా కోఆర్డినేటర్ బీవీ.వెంకట రాముడు, భాష్యం ప్ర‌వీణ్‌, టీడీపీ నేత‌లు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-15T09:50:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising