ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YuvaGalam: ఏపీలో కొండలు, గుట్టలు, వాగులన్నీ మాయం.. అందుకు కారణం ఆయనే అన్న లోకేష్

ABN, First Publish Date - 2023-05-11T10:18:15+05:30

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 96వ రోజు నందికొట్కూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర (Lokesh YuvaGalam Padaytra) 96వ రోజు నందికొట్కూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈరోజు ఉదయం నందికొట్కూరులో పాదయాత్ర ప్రారంభమవగా... యువనేతను తర్తూరు గ్రామస్తులు కలిశారు. తాము పడుతున్న బాధలను లోకేష్ ముందు ఏకరువుపెట్టారు. నందికొట్కూరు నియోజకవర్గం తర్తూరు గ్రామస్తులు యువనేత లోకేష్‌ను (Nara Lokesh) కలిసి సమస్యలను విన్నవించారు. తమ గ్రామంలో 2,200 జనాభా ఉన్నారని.. గ్రామానికి తూర్పువైపున 3,500 ఎకరాల పొలాలు ఉన్నాయన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరుచేసి తమ పొలాలకు నీరందించాలని కోరారు. తమ గ్రామంలో ప్రతి ఏటా ఏప్రిల్‌లో 20రోజుల పాటు జాతర జరుగుతుందని.. జాతరలో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నామన్నారు. మహమ్మద్ కుంటలో అధికారపార్టీ నాయకులు అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేపట్టడంతో ఇబ్బందిగా ఉందని.. అఢ్డుకుంటే కేసులు పెడుతున్నారని వాపోయారు. వైసీపీ నాయకుడు, సర్పంచ్ మేనమామ టీటీడీ ఈఓగా పనిచేస్తున్నారు. ఆయన అండదండలతో అధికారాన్ని ఉపయోగించి తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే తమపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలని కోరారు.

నారా లోకేష్ మాట్లాడుతూ... రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కొండలు, గుట్టలు, వాగులు, వంకలన్నీ మాయమై పోతున్నాయన్నారు. అక్రమ గ్రావెల్ తవ్వకాలతో అడ్డగోలుగా దోచుకోవడం, అడ్డువచ్చిన వారిపై తప్పుడు కేసులు మోపడం ఈ ప్రభుత్వంలో నిత్యకృత్యంగా మారాయని మండిపడ్డారు. బాధితులపైనే ఎదురు కేసులు పెట్టడం రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రత్యేకత అని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ప్రభుత్వం అమాయకులపై బనాయించిన తప్పుడు కేసులను ఎత్తేస్తామన్నారు. తర్తూరు గ్రామంలో సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని లోకేష్ హామీ ఇచ్చారు.

Updated Date - 2023-05-11T10:18:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising