ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YuvaGalam: దళిత ద్రోహి జగన్ రెడ్డి అన్న యువనేత... 93వ రోజుకు యువగళం

ABN, First Publish Date - 2023-05-08T10:16:01+05:30

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో విజయవంతంగా దూసుకెళ్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Naralokesh) యువగళం పాదయాత్రలో (YuvaGalam Padayatra) విజయవంతంగా దూసుకెళ్తున్నారు. ఎక్కడికక్కడ లోకేష్ పాదయాత్రకు (Lokesh Padayatra) ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు లోకేష్‌ను కలిసి తమ సమస్యలను విన్నవిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇస్తున్నారు. జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర నేటితో 93వ రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం ఎస్‌టీబీసీ గ్రౌండ్ విడిది కేంద్రం నుంచి 93వ రోజు యువగళం పాదయాత్రను లోకేష్ మొదలుపెట్టారు. పాదయాత్రలో భాగంగా లోకేష్‌ను మహాజన సోషల్ సమైక్యతా సంఘం ప్రతినిధులు కలిశారు. ఎస్సీ వర్గీకరణ అమలుచేసి, మాదిగలకు న్యాయం చేయాలని కోరారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన రైతులకు భూమి కొనుగోలు పథకం, బోర్లు, ఉచిత విద్యుత్, ఎన్ఎస్ఎఫ్ డీసీ బ్యాంకు లికేజి పునరుద్ధరించాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వం 1998 డీఎస్సీ టీచర్ పోస్టుల భర్తీలో రోస్టర్ పాయింట్ అమలుచేయలేదని.. దీంతో ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని వాపోయారు. కర్నూలు 23వవార్డు శ్రీరామ్ నగర్ సుద్దవంక వరద నీరు కాలనీలోకి ప్రవహిస్తోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఈ కాలనీలో అత్యధికంగా ఉన్నందున ఫ్లడ్ వాల్ నిర్మించాలని కోరారు.

లోకేష్ మాట్లాడుతూ... గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు అమలు చేసిన 27సంక్షేమ పథకాలను రద్దుచేసిన దళిత ద్రోహి జగన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.33,504 కోట్లను జగన్ దారి మళ్లించారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. సుద్దవంక వద్ద రక్షణగోడ నిర్మించి శ్రీరామ్ నగర్ కాలనీవాసులకు ముంపు బారినుంచి విముక్తి కల్పిస్తామన్నారు. దామాషా ప్రకారం ఎస్సీ ఉప కులాలకు సంక్షేమ ఫలాలు అందిస్తామని పేర్కొన్నారు.

Updated Date - 2023-05-08T10:16:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising