ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YuvaGalam: ఇటువంటి మంచిపని ఒక్కటైనా చేశావా జగన్?!: లోకేష్

ABN, First Publish Date - 2023-04-25T12:21:46+05:30

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర (Lokesh YuvaGalam Padayatra) జిల్లాలో కొనసాగుతోంది. ఈరోజు ఆదోని నియోజకవర్గం తుంబళం క్రాస్ విడిది కేంద్రం నుంచి 80వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. అనంతరం మంత్రాలయం నియోజకవర్గంలోకి లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra) ప్రవేశించింది. పాదయాత్రలో భాగంగా వైసీపీ ప్రభుత్వం (YCP Government), సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై (AP CM YS Jaganmohan Reddy) లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాయసీమలో ఒక్కమంచి పని అయినా చేశావా జగన్ అంటూ ప్రశ్నించారు. కరువుసీమలో సాగు, తాగునీరు అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పడిన కష్టం అడుగడుగునా సాక్షాత్కరిస్తోందన్నారు.

మంత్రాలయం నియోజకవర్గం గవిగట్టు శివార్లలో పులికనుమ బ్రాంచి కెనాల్ ఎడారిలో ఒయాసిస్సులా నీళ్లతో కళకళలాడుతూ కన్పించిందన్నారు. తుంగభద్ర ఎల్ఎల్ సి కెనాల్‌కు నీరు నిలిపివేసినప్పుడు ప్రత్యామ్నాయ సాగునీటి వనరుగా కోసిగి మండలం పులికనుమ వద్ద రూ. 261కోట్లతో చేపట్టిన ఎత్తిపోతల పథకాన్ని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిచేశారని గుర్తుచేశారు. దీనిద్వారా 64 గ్రామాలకు తాగునీరు, 26 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా డిజైన్ చేశారన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దోచుకోవడం, దాచుకోవడం తప్ప రాయలసీమ ప్రజల కళ్లలో ఆనందం చూసేలా ఒక్క పనైనా చేశావా జగన్మోహన్ రెడ్డీ అంటూ లోకేష్ విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-04-25T12:21:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising