ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Letters: చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ లక్షల్లో లేఖలు

ABN, First Publish Date - 2023-09-28T13:07:13+05:30

స్కిల్‌డెవలప్‌‌మెంట్ కేసులో అరెస్ట్‌ అయి రాజమండరి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ బాబుతో నేను అంటూ లక్షల్లో లేఖలు వస్తున్నాయి.

అమరావతి: స్కిల్‌డెవలప్‌‌మెంట్ కేసులో అరెస్ట్‌ అయి రాజమండరి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు (TDP Chief Chandrababu naidu) మద్దతు తెలుపుతూ బాబుతో నేను అంటూ లక్షల్లో లేఖలు వస్తున్నాయి. అరెస్టును ఖండిస్తూ... చంద్రబాబు సంఘీభావం తెలుపుతూ అనేక ప్రాంతాల నుంచి లేఖలు వస్తున్నాయి. ప్రభుత్వ కుట్రలను ప్రస్తావిస్తూ మీకే మా మద్దతు అని వివరిస్తూ వివిధ వర్గాల ప్రజలు లేఖలు రాస్తున్నారు. చంద్రబాబు పాలనలో తాము ఏ విధంగా లబ్ది పొందామో చెపుతూ పలువురు లబ్దిదారులు లేఖలు రాస్తున్నారు. విదేశీ విద్య, చంద్రన్న భీమా, అన్న క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్ సాయంపై లేఖల్లో ప్రస్తావించారు. టీడీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు తద్వారా తమకు ఉద్యోగాలు వచ్చిన వైనాన్ని వివరిస్తూ లేఖల్లో పేర్కొన్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా తమకు జరిగిన లబ్దిని వివరిస్తూ ప్రజలు లేఖలు రాస్తున్నారు. రాజమండ్రి పోస్టాఫీసుకు పోస్టు కార్డులు, రిజస్టర్ పోస్టులు, స్పీడ్ పోస్టుల ద్వారా రోజూ వేల సంఖ్యలో లెటర్స్ వచ్చి చేరుతున్నాయి. ‘‘మీపై అవినీతి ఆరోపణలు ప్రజలను నమ్మడం లేదని.. అరెస్టు రాజకీయ కుట్ర’’ అంటూ ప్రజలు తమ అభిప్రాయాలు చెపుతున్నారు. తనకు వచ్చిన లేఖలను చంద్రబాబు నాయుడు స్వయంగా చదువుతున్నారు.

Updated Date - 2023-09-28T13:07:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising