Chandrababu Letter: కోర్టుకు చంద్రబాబు లేఖపై లాయర్ వీవీ లక్ష్మీనారాయణ ఏమన్నారంటే..
ABN, First Publish Date - 2023-10-27T16:31:18+05:30
ఏసీబీ కోర్టు జడ్జికు టీడీపీ అధినేతే చంద్రబాబు నాయుడు రాసిన లేఖపై న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. జైల్లో భద్రతపై ఉన్న అనుమాలు, అనారోగ్య పరిస్థితి వివరిస్తూ చంద్రబాబు రాసిన లేఖ ఏసీబీ కోర్టుకు అందిందని తెలిపారు.
విజయవాడ: ఏసీబీ కోర్టు జడ్జికు టీడీపీ అధినేతే చంద్రబాబు నాయుడు రాసిన లేఖపై (TDP Chief Chandrababu Naidu Letter) న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ (Lawyer VV Lakshminarayana) మాట్లాడుతూ.. జైల్లో భద్రతపై ఉన్న అనుమాలు, అనారోగ్య పరిస్థితి వివరిస్తూ చంద్రబాబు రాసిన లేఖ ఏసీబీ కోర్టుకు అందిందని తెలిపారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తి కి భద్రత లేకుండా చేశారన్నారు. డ్రోన్‌తో జైలు పరిసరాలను చిత్రీకరించారని.. పెన్ కెమరాతో చంద్రబాబు కదలికలను రికార్డు చేశారని తెలిపారు. పెన్ కెమెరా జైల్లోకి ఎలా వెళ్లింది అని ప్రశ్నించారు. చంద్రబాబు ఉన్న బ్యారెక్‌లోకి గంజాయి వేశారన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు కదలికలపై నిఘా పెట్టారని చెప్పారు. గతంలో చంద్రబాబు పర్యటన సమయంలో రాళ్లు రువ్వారని.. ఈ ఘటనలు ప్రస్తావిస్తూ న్యాయమూర్తికి వివరించినట్లు తెలిపారు. అనారోగ్య సమస్యలును కూడా లేఖలో వివరించారన్నారు. న్యాయమూర్తి వీటిని పరిశీలించి జ్యుడీషియల్ విచారణ చేయించాలని.. అనారోగ్య సమస్యలు పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. చంద్రబాబుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని వైసీపీ నేతలు ఎలా చెబుతారు.. అంటే జ్యుడీషియల్ రిమాండ్‌లో చంద్రబాబు కదలికలు ఈ నాయకులు మానటరింగ్ చేస్తున్నారా అని న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.
Updated Date - 2023-10-27T16:34:40+05:30 IST