Visakha Railway Zone: విశాఖ రైల్వే జోన్‌కు కేంద్ర బడ్జెట్‌లో మొక్కుబడి కేటాయింపు
ABN, First Publish Date - 2023-02-03T19:36:32+05:30
కొత్త రైల్వే జోన్ (Railway Zone)ను కేంద్ర ప్రభుత్వం ఇప్పట్లో పట్టాలెక్కించేలా లేదు. విశాఖ (Visakha) కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా జోన్‌కు ఈసారి బడ్జెట్‌లో కేవలం రూ.10 లక్షలు మాత్రమే ప్రకటించింది.
విశాఖ: కొత్త రైల్వే జోన్ (Railway Zone)ను కేంద్ర ప్రభుత్వం ఇప్పట్లో పట్టాలెక్కించేలా లేదు. విశాఖ (Visakha) కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా జోన్‌కు ఈసారి బడ్జెట్‌లో కేవలం రూ.10 లక్షలు మాత్రమే ప్రకటించింది. విశాఖ రైల్వే జోన్‌కు కేంద్ర బడ్జెట్ (Union Budget)లో మొక్కుబడిగా నిధులు కేటాయించారు. గత ఏడాది రూ.40 లక్షలు కేటాయించారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్, రాయగడ డివిజన్‌కు కలిపి.. ఈ సారి ముక్కబడిగా బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేంద్రం కేటాయించింది. రూ.170 కోట్ల అంచనాతో కొత్త జోన్ ఏర్పాటుకు 2021లో కేంద్రం ప్రతిపాదనలు పంపింది. 2021-22 బడ్జెట్‌లో రైల్వేశాఖ రూ.8 లక్షలు ఖర్చు చేసింది. 2022-23 ఏడాదిలో రూ.40 లక్షలు రైల్వేశాఖ కేటాయించింది. తాజా బడ్జెట్‌లో కేవలం రూ.10 కోట్లు రైల్వే శాఖ కేటాయించింది. అంటే ఇప్పట్లో విశాఖ కేంద్రంగా కొత్త జోన్ పనులు ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. వాల్తేరు డివిజన్‌లో రెగ్యులర్‌గా జరిగే లైన్ల విస్తరణ, సబ్‌వేలు, ఓవర్ బ్రిడ్జిలు, సిగ్నలింగ్ పనులకు మాత్రం కొద్దికొద్దిగా నిధులు విడుదల చేశారు.
మరోవైపు కేంద్ర బడ్జెట్ (2023-24) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. జగన్ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర విభజన చట్టంలోని అనేక హామీలు ఇప్పటికీ అమలు కాకున్నా.. సీఎం జగన్ (CM Jagan) గట్టిగా ప్రశ్నించకపోవడంతో వాటిని కేంద్రం పక్కనపెట్టేసింది. బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులకు అత్తెసరుగా కేటాయింపులు జరిపింది. ముఖ్యంగా రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాల పెంపు ప్రస్తావనే లేదు. ఇదే సమయంలో కర్ణాటకలో ఎగువ భద్ర జాతీయ ప్రాజెక్టుకు తన వంతుగా కేంద్రం రూ.5,300 కోట్ల సాయం ప్రకటించింది. ఇక ప్రత్యేక హోదా నిజంగానే ముగిసిపోయిన అంశంగా కనిపిస్తోంది. ఢిల్లీ సందర్శించినప్పుడల్లా ప్రధాని మోదీకి, నిర్మలకు కేవలం వినతిపత్రాలు సమర్పించడానికే జగన్ పరిమితమయ్యారని.. నిధులు రాబట్టుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలూ చేయడం లేదని రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి.
Updated Date - 2023-02-03T19:36:40+05:30 IST