ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLC Elections: పంచుమర్తి అనురాధకు లోకేశ్ శుభాకాంక్షలు

ABN, First Publish Date - 2023-03-23T20:29:42+05:30

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన పంచుమర్తి అనురాధకు టీడీపీ నేత లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన పంచుమర్తి అనురాధకు టీడీపీ నేత లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మేము 23 స్థానాలే గెలిచామని వైసీపీ ఎద్దేవా చేసింది. అందులో నలుగురిని సంతలో పశువుల్లా కొన్నారు. చివరికి అదే 23 ఓట్లతో మీ ఓటమి.. మా గెలుపు. ఇది కదా దేవుడి స్క్రిప్ట్ అంటే’’ అని నారా లోకేశ్ (Nara Lokesh) వ్యాఖ్యానించారు. ఉత్కంఠ సాగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLA Quota MLC Elections) టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) విజయం సాధించారు. అనురాధ గెలిచి తీరుతారని టీడీపీ నేతలు ముందు నుంచే ధీమాగా చెబుతున్నారు. ఇప్పుడు అదే నిజమైంది. 23 ఓట్లతో అనురాధ విజయం సాధించారు. అభ్యర్థి విజయానికి 22 ఓట్లు కావాలి. కానీ అనురాధకు 23 ఓట్లు పడ్డాయి. క్రాస్ ఓటింగ్‌పై టీడీపీ నేతలు గంపెడాశ పెట్టుకుంది. అదే నిజమైంది. ఇప్పటికే మూడు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో పరాజయం వైసీపీ నాయకత్వానికి మింగుడుపడడం లేదు. అనురాధ గెలుపు వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాస్తవానికి మండలిలో టీడీపీ పాతినిధ్యం లేదని అనుకున్న సమయంలో నలుగురు సభ్యుల ప్రాతినిధ్యం పెరిగింది. మరోవైపు క్షేత్ర స్థాయి రాజకీయ పరిస్థితిని స్వయంగా చూస్తున్న శాసనసభ్యులు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో టీడీపీ వైపు మొగ్గుచూపారన్న చర్చ ప్రారంభమైంది. దీంతో వైసీపీ పెద్దల్లో భయం కనిపిస్తోందని అంటున్నారు. ఈ విజయం రాజకీయంగా ప్రభుత్వానికి పెద్ద దెబ్బేనని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని అధికార పార్టీ భయపడుతోంది.

Updated Date - 2023-03-23T20:29:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising