Mekapati: నేను ఎప్పుడూ జగన్‌తో అమర్యాదగా ప్రవర్తించలేదంటూనే..
ABN, First Publish Date - 2023-03-24T20:39:33+05:30
వైసీపీ నుంచి సస్పెన్షన్ వేటుకు గురికావడంపై ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (Mekapati Chandrasekhar Reddy) స్పందించారు.
నెల్లూరు: వైసీపీ నుంచి సస్పెన్షన్ వేటుకు గురికావడంపై ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (Mekapati Chandrasekhar Reddy) స్పందించారు. వైసీపీ (YCP)లో తనను తీవ్రంగా అవమానించారని, సస్పెండ్ చేశారు తనకు హ్యాపీనేగా ఉందని ఆయన చెప్పారు. తన బరువంతా దిగిపోయిందని, నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా మనుషుల్ని పంపారని, తాను ఎప్పుడూ జగన్‌తో అమర్యాదగా ప్రవర్తించలేదని మేకపాటి స్పష్టం చేశారు. కానీ పార్టీ తమ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించిందని, YSR కొడుకు అనే జగన్ (JAGAN) వెంట నడిచామని మేకపాటి అన్నారు.
జగన్ కోసం గతంలో మేకపాటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. ఇప్పడు అదే వైసీపీ నుంచి మేకపాటి సస్పెండ్ అయ్యారు. గతంలో వైసీపీ హైకమాండ్‌పై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇప్పుడు క్రాస్ ఓటింగ్ పేరుతో సస్పెండ్ చేశారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడే ఆర్థిక మంత్రిగా ఆనం రామనారాయణరెడ్డి పనిచేశారు. జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి రాకపోవడంతో ఆనం అసంతృప్తిగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLA Quota MLC Elections) వైసీపీకి (YSRCP) ఊహించని షాక్ తగిలిన విషయం తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు (Panchumarthy Anuradha) ఓటేయడంతో ఆమె గెలిచారు. దీంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరని ఆరాతీసిన అధిష్ఠానం కనిపెట్టేసింది. ఇద్దరు ఎమ్మెల్యేల గురించి వైసీపీ పెద్దలు సమాలోచనలు చేసి చివరికి పార్టీ నుంచి సస్పెన్షన్ చేసింది. మొత్తం నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది.
Updated Date - 2023-03-24T20:40:12+05:30 IST