ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mekapati: వైసీపీ నేతలపై మేకపాటి ఫైర్.. బస్టాండ్ సెంటర్‌లో హల్‌చల్.. ఒక్కసారిగా ఉద్రిక్తత..

ABN, First Publish Date - 2023-03-30T19:02:51+05:30

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు (YSR Congress Party leaders) ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy) సవాల్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు (YSR Congress Party leaders) ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy) సవాల్ చేశారు. ఉదయగిరికి వస్తే తరిమి కొడతామన్న వాళ్లు రావాలని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బస్టాండ్ సెంటర్లో కుర్చీ వేసుకుని చంద్రశేఖర్ రెడ్డి కూర్చొని సవాల్ చేశారు. మేకపాటి రాకతో ఉదయగిరి పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు బస్టాండ్ సెంటర్‌కు పరుగులు తీశారు. నిన్న మేకపాటికి వ్యతిరేక వర్గీయులు వార్నింగ్ ఇచ్చారు.

వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్‌ (YCP MLA Anil Kumar)పై వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడవద్దని అనిల్‌ను హెచ్చరించారు. పెద్దపెద్ద వాళ్లని తానూ తరిమినోడినేనని.. కేవలం అనిల్‌కు నోరుందనే మంత్రి పదవి ఇచ్చారన్నారు. సిటీలో అనిల్ గెలుస్తాడని అనే వారే లేరని మేకపాటి ఎద్దేవా చేశారు. తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేనని.. గత ఎన్నికల్లో 35 వేలు మెజార్టీ తెచ్చుకున్నానన్నారు. సింగిల్ డిజిట్‌తో గెలిచినోడివి అంటూ అనిల్‌కు చురకలు అంటించారు. రాబోయే ఎన్నికల్లో తాను గెలుస్తానని.. రామనారాయణరెడ్డి (Anam Ramnarayana Reddy) నూటికి నూరు శాతం, కోటంరెడ్డి (Kotamreddy Sridhar Reddy) నూటొక్క శాతం గెలుస్తారని స్పష్టం చేశారు. అనిల్‌కి అస్సలు టిక్కెట్టే ఇవ్వరంటున్నారని ముందు అది చూసుకోవాలంటూ సూచనలు చేశారు. ‘నేను గెలవకపోతే రాజకీయాలు వదిలేస్తా... నువ్వు గెలవకుంటే రాజకీయాలు వదిలేస్తావా?అని మేకపాటి హెచ్చరించారు.

అంతకు ముందు అనిల్.. పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో ఎవరు అసెంబ్లీకి వస్తారో తేల్చుకుందామని సవాల్ విసిరారు. తనను శాసనసభకు రానివ్వబోమంటూ కొందరు మంగమ్మ శపథాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల పసుపు కండువా కప్పుకున్న కొందరు జిల్లాలో పదికి పది స్థానాలూ సాధిస్తామని చెబుతున్నారని.. కనీసం ముగ్గురు గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో జగన్ బొమ్మతోనే తాను పోటీ చేస్తానని వీలైతే ఆపండి చూద్దామంటూ సవాల్ విసిరారు.

Updated Date - 2023-03-30T19:31:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising