AP Minister: సొంత నియోజకవర్గంలో అంబటికి నిరసన సెగ
ABN, First Publish Date - 2023-10-05T13:29:02+05:30
సొంత నియోజకవర్గంలోనే మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సెగ తగిలింది.
పల్నాడు: సొంత నియోజకవర్గంలోనే మంత్రి అంబటి రాంబాబుకు (Minister Ambati Rambabu)నిరసన సెగ తగిలింది. గురువారం సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామంలో నిర్వహించిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి అంబటిని మహిళలు నిలదీశారు. వైసీపీ నాయకుడు నాగార్జున యాదవ్ తమను వేదిస్తున్నాడంటూ నిలదీశారు. అయితే మహిళలు అడిగిన దానికి సమాధానం చెప్పకుండానే మంత్రి వెళ్లిపోయారు. గ్రామంలో పోలీస్ బలగాలతో అంబటి మిగిన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. సొంత పార్టీ ఎంపీటీసీని హౌస్ అరెస్ట్ చేయించి మరీ మంత్రి అంబటి రాంబాబు కార్యక్రమాన్ని చేశారు.
Updated Date - 2023-10-05T13:29:02+05:30 IST