Minister Botsa: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై త్వరలో గైడ్ లైన్స్ ఇస్తాం
ABN, First Publish Date - 2023-07-20T22:12:17+05:30
జోనల్ వ్యవస్థ ఏర్పాటు, వివిధ ఉద్యోగ సమస్యలపై మంత్రి వర్గ ఉప సంఘం (Cabinet sub-committee) సమావేశం జరిగింది. "ఏపీలో జోనల్ వ్యవస్థ ఏర్పాటుపై కసరత్తు ముమ్మరం చేశాం
అమరావతి: జోనల్ వ్యవస్థ ఏర్పాటు, వివిధ ఉద్యోగ సమస్యలపై మంత్రి వర్గ ఉప సంఘం (Cabinet sub-committee) సమావేశం జరిగింది. "ఏపీలో జోనల్ వ్యవస్థ ఏర్పాటుపై కసరత్తు ముమ్మరం చేశాం. జోనల్ వ్యవస్థ ఏర్పాటుపై కసరత్తు తుది దశలో ఉంది. జోనల్ వ్యవస్థపై ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరుపుతాం. త్వరలో కారుణ్య నియామకాలు చేపడతాం. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై త్వరలో గైడ్ లైన్స్ ఇస్తాం. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కటాఫ్ డేట్ మార్చే అంశంపై ఆలోచన చేస్తున్నాం. ఆగస్టు 7న కాంట్రాక్టు ఉద్యోగుల క్రబద్దీకరణపై జీవో ఇస్తాం." అని మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) అన్నారు.
Updated Date - 2023-07-20T22:13:17+05:30 IST