ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu: చంద్రబాబుపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-05-27T18:20:59+05:30

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై (Nara Chandrababu Naidu) మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై (Nara Chandrababu Naidu) మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) విమర్శలు గుప్పించారు. వ్యవసాయం శుద్ధ దండగ అని చంద్రబాబు చెప్పారని.. రైతుల ఆత్మహత్యలు జరిగింది చంద్రబాబు హయాంలోనే మండిపడ్డారు. చంద్రబాబు పాలన అంతా కరువు, కాటకాలే అని బొత్స విమర్శించారు. రైతుకు భరోసా కల్పించి వ్యవసాయం వైపు నడిపించింది వైసీపీ ప్రభుత్వమే అన్నారు. రాష్ట్ర అభివృద్ధి సూచీ టీడీపీ కంటే ఎక్కువ ఉందనే గణాంకాలు నిజమా.? కాదా..? అని చంద్రబాబు చెప్పాలన్నారు.

రాజమండ్రిలో మహా డ్రామా జరుగుతుందని, ఎన్టీఆర్ చావుకు చంద్రబాబు కారణమని, ఎన్టీఆర్ ఆత్మ క్షోబించడానికి కారణం చంద్రబాబు అని ఆరోపించారు. మళ్లీ ఆయన ఫోటోకు చంద్రబాబు దండ వేస్తున్నారని, చంద్రబాబుకు చెప్పుకోనేందుకు ఒక పథకమైన ఉందా అని మంత్రి ప్రశ్నించారు. బాబు హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదా?, వ్యవసాయం దండగని చెప్పింది చంద్రబాబు కాదా అని మంత్రి అన్నారు. చంద్రబాబు హయాంలో 22 స్థానంలో ఉన్న జీడీపీ నేడు మొదట స్థానంలో లేదా అని మంత్రి ప్రశ్నించారు.

విద్య, వైద్యం, వ్యవసాయం సంక్షేమంకు సీఎం జగన్ పెద్ద పీట వేశారని, వాస్తవాలు ప్రజలకు తెలుసని మంత్రి బొత్స అన్నారు. అధికారం ఇచ్చిన ఐదేళ్లు చంద్రబాబు దోచుకుతిన్నారని, చంద్రబాబు సామాజిక వర్గానికి దోచిపెట్టారని మంత్రి ఆరోపించారు. ప్రతి రంగాన్ని సీఎం జగన్ అభివృద్ధి చేశారని, మళ్లీ అధికారంలోకి వచ్చేది జగన్ మోహన్ రెడ్డినే అని మంత్రి అన్నారు. రోజుకొక డ్రామా సీబీఐ ఆడుతుందా తాము ఆడుతున్నామా అని, ఒకే సారి అవినాష్ రెడ్డిని విచారణ చేయొచ్చు కదా అని చెప్పారు. చంద్రబాబు ఎన్ని మేనిఫెస్టోలు విడుదల చేసినా ప్రజలు నమ్మరని, సీఎం జగన్ ఇచ్చిన హామీల్లో 98.5 శాతం అమలు చేశారని మంత్రి బొత్స గుర్తు చేశారు.

Updated Date - 2023-05-27T18:21:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising