Minister Peddireddy: 3 ప్రాంతాల్లో బస్సుయాత్ర.. వైసీపీ పథకాలను ప్రజలకు వివరిస్తాం
ABN, First Publish Date - 2023-10-21T18:19:11+05:30
రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో బస్సుయాత్ర నిర్వహిస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, రాయలసీమ జిల్లాల వైసీపీ సమన్వయకర్త పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
కడప: రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో బస్సుయాత్ర నిర్వహిస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, రాయలసీమ జిల్లాల వైసీపీ సమన్వయకర్త పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కడపలో నిర్వహించిన పార్టీ సమన్వయ సమావేశానికి అన్ని నియోజకవర్గాల వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
"ఈ నెల 26న ఉమ్మడి కడప జిల్లాల్లో మొదటివిడత సామాజిక సాధికారిక బస్సుయాత్ర. రాయలసీమలో 7 చోట్ల బస్సు యాత్ర. ప్రొద్దుటూరు, తంబళ్లపల్లెలో మొదటి విడత బస్సు యాత్ర. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను బస్సుయాత్రలో వివరిస్తాం. నాలుగున్నర ఏళ్లలో వైసీపీ చేపట్టిన పథకాలను ప్రజలకు తెలియజేస్తాం." అని పెద్దిరెడ్డి అన్నారు.
Updated Date - 2023-10-21T18:22:11+05:30 IST