MLA Pinnelli Ramakrishna Reddy : వివేకా హత్యలో దోషులు ఎవరున్నా శిక్షించాల్సిందే..

ABN, First Publish Date - 2023-04-17T13:50:46+05:30

ల్నాడులో రాజకీయాలు ఎప్పుడు హీట్ గానే ఉంటాయని మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రాబోవు ఎన్నికల్లో పల్నాడులోని 7 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందన్నారు.

MLA Pinnelli Ramakrishna Reddy : వివేకా హత్యలో దోషులు ఎవరున్నా శిక్షించాల్సిందే..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల : పల్నాడులో రాజకీయాలు ఎప్పుడు హీట్ గానే ఉంటాయని మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రాబోవు ఎన్నికల్లో పల్నాడులోని 7 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందన్నారు. 2024లో తిరిగి వైసీపీదే అధికారమన్నారు. వివేకా హత్యని రాజకియం చెయ్యడం బాధాకరమన్నారు. వివేకా హత్యలో దోషులు ఎవరు ఉన్నా శిక్షించాల్సిందేనన్నారు. కేసుపై సీబీఐ దర్యాప్తు జరుగుతుండగానే.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. చంద్రబాబుకి వయస్సు అయిపోయిందన్నారు. జ్ఞాపక శక్తి తగ్గిందన్నారు. చంద్రబాబు కారణంగానే రాష్ర్టానికి రాజధాని సమస్య ఏర్పడిందని పిన్నెల్లి పేర్కొన్నారు. 2024 ఎన్నికల తరువాత చంద్రబాబు,లోకేష్ తోకలు కట్ చేస్తామన్నారు. శ్రీవారి దర్శనార్ధం వచ్చే భక్తులకి టీటీడీ మెరుగైన సౌకర్యలు కల్పిస్తోందన్నారు. అయితే కొంత మంది అనవసరంగా టీటీడీ అధికారుల పై ఆరోపణలు చేస్తున్నారంటూ పరోక్షంగా ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు.

Updated Date - 2023-04-17T13:50:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising