ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MP Raghurama: ఏపీ సర్కార్‌కు చిరంజీవి బాగా గడ్డిపెట్టారు

ABN, First Publish Date - 2023-08-08T14:45:02+05:30

‘‘వాల్తేరు వీరయ్య’’ సినిమా 200 రోజుల వేడుకల్లో భాగంగా ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను ఎంపీ రఘురామకృష్ణ రాజు సమర్ధించారు.

న్యూఢిల్లీ: ‘‘వాల్తేరు వీరయ్య’’ సినిమా 200 రోజుల వేడుకల్లో భాగంగా ఏపీ ప్రభుత్వంపై (AP Government) మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను ఎంపీ రఘురామకృష్ణ రాజు (MP Raghuramakrishna raju) సమర్ధించారు. ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చాలా చక్కగా మాట్లాడారన్నారు. సినిమాపై ఏంటి పోలవరం, ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని బాగా గడ్డి పెట్టారని వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా మాట్లాడారని.. చిరంజీవి మాటలు ప్రశంసనీయం అంటూ ఎంపీ రఘురామ కొనియాడారు.


అలాగే రాష్ట్రంలోని పలు అంశాలను ఎంపీ ప్రస్తావిస్తూ.. ‘‘మాజీ మంత్రి వివేకానంద రెడ్డి జయంతి నేడు. వివేకా కేసులో అజయ్ కల్లం, ఉమా రెడ్డిని పిలిచారు.. దువ్వూరి కృష్ణ, కృష్ణమోహన్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారని అంటున్నారు. అజయ్ కల్లం నేను చెప్పింది ఒకటి సీబీఐ రాసింది ఒకటి అని కేసు వేశారు. జడ్జి పిలిచినప్పుడు తర్వాత చేపొచ్చు.. ఇప్పుడే ఎందుకు. అసలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పిలవలేద?.. జగన్‌‌కు ఎప్పుడు ఫోన్ వచ్చిందో చెప్పాలి కదా.. జగన్ పిలిచి ఉంటారేమో కానీ ఆయనకు బిజీగా ఉండి వెళ్ళకపోవచ్చు. మూడు నెలలు సమయం అడిగి ఉంటారేమో... అజయ్ కల్లం అనవసరంగా పిటిషన్ వేశారు. వివేకానంద రెడ్డి కేసులో నిజ దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నా. ఇలాగే సునీత పోరాటం స్ఫూర్తిగా కొనసాగాలి. వలంటీరీల అరాచకాలు ఎక్కువయ్యాయి. వలంటరీలకు నాయకుడు జగన్మోహన్ రెడ్డి. వలంటరీ కాలకేయులుగా మారారు’’ అంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-08-08T14:45:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising