కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MVV Satyanarayana : రఘురామపై పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో వైసీపీ ఎంపీ తిట్ల దండకం

ABN, First Publish Date - 2023-07-20T13:44:08+05:30

పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో వైసీపీ ఎంపీ తిట్ల దండకం అందుకున్నారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై అసభ్య పదజాలంతో విశాఖ ఎంపీ ఎంవీవీ దండెత్తారు. తన కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ వ్యవహారంపై స్పీకర్‌, హోం మంత్రిత్వ శాఖకు రఘురామ లేఖ రాయడంపై ఎంవీవీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

MVV Satyanarayana : రఘురామపై పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో వైసీపీ ఎంపీ తిట్ల దండకం

ఢిల్లీ : పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో వైసీపీ ఎంపీ తిట్ల దండకం అందుకున్నారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై అసభ్య పదజాలంతో విశాఖ ఎంపీ ఎంవీవీ దండెత్తారు. తన కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ వ్యవహారంపై స్పీకర్‌, హోం మంత్రిత్వ శాఖకు రఘురామ లేఖ రాయడంపై ఎంవీవీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంపేస్తా అంటూ... ఇతర ఎంపీల ముందే రఘురామపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నువ్వెవడివి నా కుటుంబం గురించి లేఖ రాయడానికి?’ అంటూ ఎంవీవీ ఫైర్ అయ్యారు.

చెప్పనలవి కాని భాషతో ఎంపి రఘురామపై పార్లమెంటు ఆవరణలో వైసీపీ ఎంపీ ఎంవీవీ దూషణలకు దిగారు. ఎంవీవీ ప్రవర్తనపై సెంట్రల్‌ హాల్‌లో కూర్చున్న ఎంపీలు ఆందోళనకు గురయ్యారు. పరిస్థితిని గమనించి... వైసీపీ లోకసభా పక్ష నేత మిథున్‌ రెడ్డి.. ఎంవీవీని బయటికి తీసుకువెళ్లారు. అయితే ఎంవీవీ వైఖరిపై ఎంపీ రఘురామ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఎంవీవీ దూషిస్తున్నంత సేపు మౌనంగానే ఎంపీ మిథున్‌రెడ్డి సెంట్రల్‌ హాల్‌లో కూర్చోవడం గమనార్హం. రఘురామను బెదిరించిన వైసీపీ రెండో ఎంపీ ఎంవివి సత్యనారాయణ. గతంలో కూడా పార్లమెంట్ 4వ నెంబర్‌ గేట్‌ సమీపంలో ‘చంపేస్తా’ అంటూ... రఘురామను హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ బెదిరించిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-07-20T13:44:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising