Nakka Anand Babu: టీడీపీ ప్రభుత్వం వస్తే అంబటి సహా మంత్రులందరీ జీవితాలు ఎలా ఉంటాయో..
ABN, First Publish Date - 2023-10-26T20:41:04+05:30
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కాఆనంద్ బాబు విమర్శలు గుప్పించారు.
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కాఆనంద్ బాబు విమర్శలు గుప్పించారు.
"జగన్ జైలుకు వెళ్తే తల్లీ..చెల్లీ తప్ప ఎవరూ స్పందించలేదు. చంద్రబాబుకు మద్దతుగా వస్తున్న ప్రజాస్పందను నిలువరించడానికి జగన్ పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకున్నారు. టీడీపీ అధినేత తప్పు చేశాడనే ఆధారాలు, సాక్ష్యాలు జగన్ వద్ద లేవు కాబట్టే.. ప్రజలసొమ్ముతో నియమించిన లాయర్లతో కోర్టుల్లో కాలయాపన చేస్తున్నారు. ఎండిపోతున్న పంటలు.. రైతుల బాధలు పట్టని అంబటి... నోటి పారుదల మంత్రిగా పేరు పొందడానికి పాకులాడుతున్నారు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి మరోసారి గెలవడానికి నీకు పాతికేళ్లు పట్టింది రాంబాబు. జగన్ సర్కార్ 108 మద్యం బ్రాండ్లకు అనుమతిచ్చిన సంగతి.. రూ.2 లక్షల కోట్ల విలువైన కల్తీమద్యం అమ్మిన సంగతి మరిచావా అంబటి?. టీడీపీ ప్రభుత్వం వస్తే అంబటి సహా.. మంత్రులందరి జీవితాలు ఎలా ఉంటాయో వారి ఊహకే వదిలేస్తున్నాం. భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లి, జగన్ రెడ్డి కుట్రలు.. కుయుక్తులు బయటపెడుతోందనే మంత్రులు ఆమెపై నోరు పారేసుకుంటున్నారు. చంద్రబాబుని, ఆయన కుటుంబసభ్యుల్ని, టీడీపీ నేతల్ని దూషించడం తప్ప మంత్రులకు, వైసీపీ నేతలకు ఇతర సమస్యలు, ప్రజల అవస్థలు పట్టడం లేదు. బాగా తిట్టేవారికి జగన్ రెడ్డి మార్కులేస్తుంటే, ఆయన దృష్టిలో పడటంకోసం మంత్రులు నోళ్లు పారేసుకుంటున్నారు. చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపిన జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం ఇప్పటివరకు ఆయన తప్పు చేశాడని న్యాయస్థానాల్లో ఎందుకు నిరూపించలేకపోయింది?." అని టీడీపీ నేత నక్కాఆనంద్ బాబు ప్రశ్నించారు.
Updated Date - 2023-10-26T20:41:26+05:30 IST