ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nara Bhuvaneshwari : అన్యాయం, అధర్మం చీకటికి సంకేతాలు

ABN, First Publish Date - 2023-10-06T12:27:19+05:30

అన్యాయం, అధర్మం చీకటికి సంకేతాలని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు రాష్ట్రంలో ఉన్న చీకటిని సూచిస్తోందన్నారు.

అమరావతి : అన్యాయం, అధర్మం చీకటికి సంకేతాలని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు రాష్ట్రంలో ఉన్న చీకటిని సూచిస్తోందన్నారు. ఆ చీకటిని తరిమికొట్టాలనే మార్పు మనలో రావడమే క్రాంతి అని పేర్కొన్నారు. ‘కాంతితో క్రాంతి’ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 7, రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్స్ ఆఫ్ చేసి బయటకు వచ్చి దీపాలను వెలిగిద్దామని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.

కాగా.. చంద్రబాబుకు మద్దతుగా ‘కాంతితో క్రాంతి’ కార్యక్రమానికి నారా లోకేష్ పిలుపునిచ్చారు. 7వ తేదీ శనివారం రాత్రి 7.00 గంటల నుంచి 7.05 నిమిషాల వరకూ ఇళ్లలో లైట్లు ఆపి.. దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్ వెలిగించి.. వాహనాల లైట్లు బ్లింక్ చేయడం ద్వారా దార్శనికుడు చంద్రబాబుకి సంఘీభావం తెలపాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు. ‘బాబుతో నేను’ అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలన్నారు. వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్‌లు, టార్చ్ లైట్లు.. వీటిలో వేటినైనా తీసుకుని వెలుగు చూపించాలని నారా లోకేష్ అన్నారు.

Updated Date - 2023-10-06T12:27:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising