ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nara Bhuvaneswari : జైలులో భయంకరమైన పరిస్థితులు నా భర్తకు ముప్పు తలపెట్టేలా ఉన్నాయి

ABN, First Publish Date - 2023-10-13T12:14:03+05:30

జైల్లో తన భర్తకు అత్యవసరంగా అవసరమైన వైద్యాన్ని సకాలంలో అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు.

అమరావతి : జైల్లో తన భర్తకు అత్యవసరంగా అవసరమైన వైద్యాన్ని సకాలంలో అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. తన భర్త క్షేమం గురించి చాలా ఆందోళన చెందుతున్నానన్నారు. ఆయన ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గారని పేర్కొన్నారు. ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారని భువనేశ్వరి తెలిపారు. జైల్లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండడంతో చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందన్నారు. ఈ భయంకరమైన పరిస్థితులు తన భర్తకు తీవ్ర ముప్పు తలపెట్టేలా ఉన్నాయని నారా భువనేశ్వరి అన్నారు.

కాగా.. కారాగారంలో సౌకర్యాల లేమి, ఎండ వేడిమి, డీహైడ్రేషన్‌తో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అస్వస్థతకు గురయ్యారు. ఆయన స్కిన్‌ అలర్జీతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని రెండు రోజుల కిందటే జైలు ఆస్పత్రి వైద్యులు గుర్తించి... అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో గురువారం జైలు ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ రాజ్‌కుమార్‌ రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్యశాల (జీజీహెచ్‌) సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు డెర్మటాలజిస్టులను పంపించాలంటూ కోరారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ లక్ష్మీ సూర్యప్రభ అప్పటికప్పుడు ఇద్దరు డెర్మటాలజిస్టులకు ఈ బాధ్యత అప్పగించారు. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ డెర్మటాలజీ డాక్టర్‌ జి.సూర్యనారాయణ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ డెర్మటాలజీ డాక్టర్‌ సీహెచ్‌వీ.సునీతా దేవి సాయంత్రం కారాగారం వద్దకు చేరుకున్నారు. అయితే... సరైన పత్రాలు లేవంటూ జైలు సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో... కాసేపటికి సూపరింటెండెంట్‌ లేఖ తీసుకువచ్చారు. సాయంత్రం 5.45 గంటల సమయంలో ఇద్దరు డాక్టర్లు జైలు లోపలికి వెళ్లారు. తిరిగి 6.30 గంటలకు బయటికి వచ్చారు. చంద్రబాబుకు గడ్డం, చేతులు, ఛాతీపై దద్దుర్లు వచ్చినట్లు సమాచారం. ఆయనను పరీక్షించిన వైద్యులు కొన్ని మందులు రాశారని... జైలు మెడికల్‌ సిబ్బంది వాటిని చంద్రబాబుకు ఇచ్చారని తెలుస్తోంది. చంద్రబాబు ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేస్తామని డీఐజీ రవికిరణ్‌ తెలిపారు.

Updated Date - 2023-10-13T12:21:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising