ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nara Lokesh: ఏపీ రాష్ట్ర ప్రజలకు నారా లోకేశ్ లేఖ.. యుద్ధంలో తనతో కలిసి రావాలని పిలుపు

ABN, First Publish Date - 2023-09-10T23:42:41+05:30

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి 14 రోజుల రిమాండ్ విధించడంతో.. ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. ఈ నేపథ్యంలో...

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి 14 రోజుల రిమాండ్ విధించడంతో.. ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. కన్నీళ్లతో, బరువెక్కిన హృదయంతో తాను ఈ లేఖ రాస్తున్నానన్న ఆయన.. తెలుగువారి అభ్యున్నతికి మా నాన్న శ్రమించారన్నారు. లక్షలమంది జీవితాల్లో మార్పు రావాలని తన తండ్రి తపించారని.. ఆయనకు విశ్రాంతి తీసుకోవడం తెలియదని అన్నారు. తండ్రి నుంచి ప్రేరణ పొంది, ఆయన అడుగుజాడల్లో తాను నడుస్తున్నానన్నారు. అమెరికాలో ఉద్యోగం వదిలి మరీ దేశానికి తిరిగొచ్చానన్న లోకేశ్.. రాజకీయ పగలు, కక్షలకు హద్దులు లేవా? అని ప్రశ్నించారు. తన తండ్రి ఓ పోరాడ యోధుడని, తానూ అంతే అని ఉద్ఘాటించారు. ఈ యుద్ధంలో తనతో కలిసి రావాలని రాష్ట్ర ప్రజల్ని కోరారు.


మరోవైపు.. నారా లోకేశ్‌కు పవన్‌ కల్యాణ్‌ ఫోన్ చేసి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, జగన్‌ నియంత పాలనపై కలిసి పోరాడుదామని చెప్పారు. ఇదిలావుండగా.. చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో లోకేశ్ తన యువగళం పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేయనున్నారన్న ప్రచారం జరుగుతోంది. తండ్రితోనే ఉంటున్న ఆయన.. బెయిల్‌పై న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా తన పాదయాత్రపై లోకేశ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు.. చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్‌ని అమలు చేశారు. జిల్లాలోని పరిస్థితులను ఎస్పీ జగదీష్ పరిశీలిస్తున్నారు.

Updated Date - 2023-09-10T23:42:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising