RRR: ఈసీని కలిసిన ఎంపీ రఘురామ.. దొంగ ఓట్ల వ్యవహారంపై ఫిర్యాదు
ABN, First Publish Date - 2023-07-17T20:14:44+05:30
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ఎంపీ రఘురామ కృష్ణంరాజు కలిశారు. ఈ మేరకు సీఈసీ డిప్యూటీ చీఫ్ ధర్మేంద్రశర్మను కలిసి వైసీపీ సర్కారు చేపడుతున్న దొంగ ఓట్ల వ్యవహారం, ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు అందజేశారు. ఆగస్ట్ తొలివారంలో విశాఖలో పర్యటించి రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశం అవుతానని డిప్యూటీ చీఫ్ ధర్మేంద్రశర్మ తనకు చెప్పారని రఘురామ వెల్లడించారు.
ఏపీ(Andhra Pradesh)లో ఓట్ల రాజకీయంపై హాట్‌హాట్‌గా చర్చ నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వం (YSRCP Government) దొంగ ఓట్ల నమోదు చేపడుతోందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా తమకు అనుకూలంగా లేని ఓట్లను జగన్ సర్కారు తొలగిస్తోందని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు (Raghu Rama Krishnam Raju) కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి ఏపీలో జరుగుతున్న దొంగ ఓట్ల వ్యవహారం, ఓట్ల తొలగింపుపై సీఈసీ(Central Election Commission)కి ఫిర్యాదు చేశారు.
సోమవారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ఎంపీ రఘురామ కృష్ణంరాజు కలిశారు. ఈ మేరకు సీఈసీ డిప్యూటీ చీఫ్ ధర్మేంద్రశర్మను కలిసి వైసీపీ సర్కారు చేపడుతున్న దొంగ ఓట్ల వ్యవహారం, ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు అందజేశారు. అనంతరం ఎంపీ రఘురామ మీడియాతో మాట్లాడారు. ఏపీలో ప్రతిపక్ష ఓట్ల తొలగింపు, అధికార పార్టీ దొంగ ఓట్ల నమోదుపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు తాను ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆగస్ట్ తొలివారంలో విశాఖలో పర్యటించి రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశం అవుతానని డిప్యూటీ చీఫ్ ధర్మేంద్రశర్మ తనకు చెప్పారని రఘురామ వెల్లడించారు. దొంగ ఓట్ల నమోదుపై మరింత సమాచారం ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారి తనను కోరారని రఘురామ చెప్పారు. ఓట్ల నమోదు, తొలగింపు విషయంలో ఎలాంటి తప్పులు జరిగినా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారన్నారు.
ఇది కూడా చదవండి: Vijayawada: వంగలపూడి అనితపై అసభ్య పోస్టులు
కాగా 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో ఉన్న రఘురామ కృష్ణంరాజు ఆ తర్వాత వైసీపీ అధిష్టానం టిక్కెట్ ఆఫర్ చేయడంతో ఆ పార్టీలో చేరిపోయారు. నర్సాపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆ తర్వాత సరైన గౌరవ మర్యాదలు దక్కడం లేదన్న కారణంగా అసంతృప్తికి గురయ్యారు. పార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రుల్ని ఎవర్నీ కలవడకూడదని ఆంక్షలు పెట్టినా రఘురామ పలువుర్ని కలిశారు. దీంతో ఆయనను వైసీపీ దూరం పెట్టింది. ఆ తర్వాత రఘురామ రెబల్ ఎంపీగా మారి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఖండిస్తున్నారు.
Updated Date - 2023-07-17T20:14:53+05:30 IST