ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: మూడు రాజధానుల నాటకానికి జగన్ ప్లాన్ అదే: అచ్చెన్నాయుడు

ABN, First Publish Date - 2023-04-19T19:14:22+05:30

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు (YS Viveka Case)పై ప్రజల్లో జరుగుతున్న చర్చని డైవర్ట్ చేయడానికే మూడు రాజధానుల నాటకానికి జగన్ (Jagan) తెరలేపాడని టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu Kinjarapu) ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు (YS Viveka Case)పై ప్రజల్లో జరుగుతున్న చర్చని డైవర్ట్ చేయడానికే మూడు రాజధానుల నాటకానికి జగన్ (Jagan) తెరలేపాడని టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu Kinjarapu) ఆగ్రహం వ్యక్తం చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ నడపడం, జగన్‌కి వెన్నతో పెట్టిన విద్యని విమర్శించారు. రాజ్యాంగ బద్దంగా, ప్రజాస్వామ్య బద్ధంగా సీఎం జగన్ ఎన్నికయ్యాడా? లేదా? అనే అనుమానం కలుగుతుందన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన సీఎం అయితే, రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాలని సూచించారు. రాజధాని అంశం సుప్రీంకోర్టులో ఉంటే సెప్టెంబరు నుంచి వైజాగ్‌లో పాలన చేస్తానని సీఎం జగన్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజలని మోసం చేసేందుకు ఇలాంటి ప్రకటన చేశారని ఆరోపించారు. ఏపీ (AP)లో ఎన్నికలు రేపు వస్తాయో? ఎల్లుండి వస్తాయో? తెలియదన్నారు. ఈ ప్రభుత్వం వెంటిలేటర్‌పై నడుస్తోందన్నారు. తమ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకి ఏమి చేశామన్న దానిపై వైట్ పేపర్ రిలీజ్ చేసేందుకు తాము సిద్ధమన్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టారని గుర్తుచేశారు. మూలపేట పోర్ట్ శంకుస్థాపన పెద్ద బూటకమన్నారు.

Updated Date - 2023-04-19T19:14:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising