Beeda Ravichandra: ఎమ్మెల్యే అనిల్‌పై బీద రవిచంద్ర హాట్ కామెంట్స్...
ABN, First Publish Date - 2023-06-25T09:54:44+05:30
నెల్లూరు: మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్‌పై టీడీపీ నేత బీద రవిచంద్ర హాట్ కామెంట్స్ చేశారు. ఓ ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ బాష చూస్తుంటే అసహ్యమేస్తోందన్నారు.
నెల్లూరు: మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA) అనిల్ కుమార్ (Anilkumar)పై టీడీపీ నేత (TDP Leader) బీద రవిచంద్ర (Beeda Ravichandra) హాట్ కామెంట్స్ (Hot Comments) చేశారు. ఓ ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ బాష చూస్తుంటే అసహ్యమేస్తోందన్నారు. జగన్మోహన్ రెడ్డి (Jaganmohanreddy) వారంలో నాలుగు రోజులు పాదయాత్ర చేస్తే, మూడు రోజులు కోర్టు యాత్రలు, చీకటి యాత్రలు చేశారని ఎద్దేవా చేశారు. ‘‘ఏంది రా... అనిలా... నీకు లోకేశ్ వచ్చి ఏమిచేశామో చెప్పాలా? ఇప్పటి వరకు పనిచేసిన నీటిపారుదల శాఖ మంత్రుల్లో అనిల్ అంతటి అసమర్దుడు లేడు. పోలవరం మట్టి అమ్ముకోవడం తప్పించి, పనులు పూర్తి చేయలేకపోయావు. మీ సీఎం నీకు గౌరవం ఇవ్వలేదు.. సంగం, నెల్లూరు బ్యారేజీ పనులు 15 శాతం మిగిలి ఉంటే ఇప్పటికీ పూర్తికాలేదు. దమ్ముంటే సంగం బ్యారేజీ దగ్గరకి రా... సిగ్గులేకుండా సీఎం జగన్ పూర్తికాని సంగం బ్యారేజీని ప్రారంభించారు.’’ అంటూ బీద రవిచంద్ర కామెంట్స్ చేశారు.
Updated Date - 2023-06-25T09:54:44+05:30 IST