ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Big Shock to CM Jagan : నెల్లూరులో జగన్‌కి బిగ్ షాక్..

ABN, First Publish Date - 2023-06-08T12:01:29+05:30

సీఎం జగన్‌కి బిగ్ షాక్. జగన్ ఆదేశాలు, సూచనలని ఎమ్మెల్యే అనిల్ కుమార్, ఆయన బాబాయి రూప్ కుమార్ ఏమాత్రం లెక్క చేయడం లేదు. అప్పుడెప్పుడో చేయి చేయి కలిపి సఖ్యంగా ఉండాలని జగన్ చెబితే ఓకే అని తలాడించారు. ఇక అంతే.. ఆ తరువాత ఎవరికి వారే యమునా తీరే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు : సీఎం జగన్‌ (CM Jagan)కి బిగ్ షాక్. జగన్ ఆదేశాలు, సూచనలని ఎమ్మెల్యే అనిల్ కుమార్ (MLA Anil Kumar), ఆయన అన్న కుమారుడైన రూప్ కుమార్ (Roop Kumar) ఏమాత్రం లెక్క చేయడం లేదు. అప్పుడెప్పుడో చేయి చేయి కలిపి సఖ్యంగా ఉండాలని జగన్ చెబితే ఓకే అని తలాడించారు. ఇక అంతే.. ఆ తరువాత ఎవరికి వారే యమునా తీరే. నెల్లూరు సిటీ వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. నగరంలోని జేమ్స్ గార్డెన్‌లో జగనన్న భవన్ పేరిట సొంతగా కార్యాలయాన్ని నేడు రూప్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నుడా ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ హాజరయ్యారు. మొత్తానికి రూప్ కుమార్ అయితే తన కార్యకర్తలతో ఏకంగా బలప్రదర్శన నిర్వహించారనే చెప్పాలి. ఆయన కార్యాలయ ఓపెనింగ్‌తో గంట సేపటికి పైగా ట్రాఫిక్ స్తంభించింది.

గత నెల 12వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావలి పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన అనిల్ కుమార్, రూప్ కుమార్‌లను కలిపే కార్యక్రమానికి సైతం శ్రీకారం చుట్టారు. జగన్ స్వయంగా వారిద్దరిని చేతిలో చేయి వేయించి మరీ రూప్ కుమార్‌కు ఓ బాధ్యత అప్పగించారు. రేపు నెల్లూరులో అనిల్‌ని గెలిపించే భాధ్యతను రూప్ కుమార్‌పై మోపారు సీఎం జగన్. ఈ తరుణంలో ఇద్దరూ నోరు మెదపక మౌనంగా తలాడించారు. జగన్ కూడా ఇక అంతా సెట్ అయిపోయిందనుకున్నారు. కానీ సీఎం వెళ్లిన వెంటనే అనిల్ మళ్లీ మొదటికి వచ్చారు. ఆ తరుణంలో ఒక సంచలన వ్యాఖ్య కూడా చేశారు. అవసరమైతే రాజకీయాల్ని వడులుకుంటా గానీ రూప్ కుమార్‌తో కలిసే ప్రసక్తే లేదని సన్నిహితుల వద్ద తేల్చి చెప్పినట్లు సమాచారం.

ఇక రూప్ కుమార్.. అప్పటికి సైలెంట్‌గా ఉన్నా కూడా తాజాగా మాత్రం సంచలన నిర్ణయమే తీసుకున్నారు. ప్రత్యేకంగా జగనన్న భవన్ పేరిట సొంతగా కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతటితో ఆగారా? ఈ సందర్భంగా బలప్రదర్శన నిర్వహించారు. తనతో పాటు ఎంత క్యాడర్ ఉందనేది అధిష్టానానికి తెలిసేలా చేశారు. దీంతో రూప్ కుమార్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో తానూ నిలుస్తానని పరోక్ష సంకేతాలిచ్చారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక చూడాలి.. దీని తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయో..!

Updated Date - 2023-06-08T12:14:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising