AP News.. వివేకా హత్య కేసులో నిందితులు సీబీఐపై తప్పుడు ఆరోపణలు: కర్నాటి
ABN, First Publish Date - 2023-04-29T12:12:30+05:30
నెల్లూరు: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితులు సీబీఐపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయులు రెడ్డి విమర్శించారు.
నెల్లూరు: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case)లో ప్రధాన నిందితులు సీబీఐపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయులు రెడ్డి (Karnati Anjaneyulu Reddy) విమర్శించారు. శనివారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం (Central Govt.) అండతో వివేక హత్య కేసు ఆలస్యమవుతుందనే ప్రచారంలో ఎలాంటి వాస్తవాలు లేవన్నారు. వైసీపీ ప్రభుత్వ (YCP Govt.) నేతలపై ఛార్జ్ షీట్ తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వమే సీబీఐకి ఆదేశాలు జారీచేసిందని ఈ సందర్భంగా చెప్పారు.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గాలపై దృష్టి పెట్టేందుకు బీజేపీ రాష్ట్ర పార్టీ రెండు టీమ్‌లను ఏర్పాటు చేసిందని కర్నాటి ఆంజనేయులు రెడ్డి తెలిపారు. వివేకా హత్యలో దోషులు ఎంత పెద్ద వ్యక్తులైన సరే చట్టం నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. వైసీపీని అధికారం నుంచి దించేందుకు బీజేపీ గట్టిగా పని చేస్తోందన్నారు. కార్పొరేషన్‌లో గిరిజన మహిళా మేయర్‌పై దాడి చేయడం బాధాకరమన్నారు. వైసీపీ కార్పోరేటర్లు కౌంటర్ కేసు పెట్టడం దారుణమని కర్నాటి ఆంజనేయులు రెడ్డి అన్నారు.
Updated Date - 2023-04-29T12:12:30+05:30 IST