ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Anil Kumar: లోకేష్ యువగళం పాదయాత్ర కాదు.. అదో విహారయాత్ర

ABN, First Publish Date - 2023-06-24T14:47:32+05:30

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రపై ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర కాదని.. అదో విహారయాత్ర అని వ్యాఖ్యలు చేశారు. జగన్ పాదయాత్ర చేస్తే ఉదయం నుంచి రాత్రి వరకు చేశారన్నారు. సాయంత్రం 4 గంటలకు కాసేపు నడిచి లోకేష్ కాలయాపన చేస్తున్నారని అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Nara lokesh) యువగళం పాదయాత్రపై (YuvaGalam Padayatra) ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ (MLA Anilkumar Yadav)విమర్శలు గుప్పించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర కాదని.. అదో విహారయాత్ర అని వ్యాఖ్యలు చేశారు. జగన్ పాదయాత్ర చేస్తే ఉదయం నుంచి రాత్రి వరకు చేశారన్నారు. సాయంత్రం 4 గంటలకు కాసేపు నడిచి లోకేష్ కాలయాపన చేస్తున్నారని అన్నారు. లోకేష్ మాట్లాడే ముందు భాష నేర్చుకోవాలని హితవుపలికారు. ‘‘లోకేష్‌‌కు నిజంగా దమ్ముంటే జిల్లాలో అభివృద్ధిపై చర్చకి రావాలి. సమయం, వేదిక నీ ఇష్టం.. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎవరి హయాంలో జరిగాయో తెలుసా? జిల్లాలో పెన్నానదిపై సంగం, నెల్లూరు బ్యారేజీలు ఎవరు పూర్తి చేశారో తెలుసా?. నెల్లూరు సిటీలో చర్చిద్దాం.. దమ్ముంటే రా... లోకేష్’’‌కు అనిల్ ఛాలెంజ్ విసిరారు. రాష్ట్రమంతా పాదయాత్ర తరువాత ముందు మంగళగిరిలో గెలువు చూద్దామన్నారు. ఆనం కుటుంబం పట్ల ఇంకా మంచిపేరు ఉందంటే అది విజయ్ కుమార్ రెడ్డి వల్లే అని అన్నారు. ఎమ్మెల్యే అవకాశం ఇస్తే జగన్‌ను విమర్శిస్తావా? అంటూ మండిపడ్డారు. జిల్లాలో అభివృద్ధిపై ఆనం వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. సిగ్గుంటే ఎమ్మెల్యే పదవికి ఆనం రాజీనామా చేసి వెళ్ళాలి అని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-06-24T14:48:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising