ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kotamreddy: సీఎం, రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిసిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2023-04-14T12:01:54+05:30

బరాషాహిద్ దర్గా అభివృద్ధి పనులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నెల్లూరు: బరాషాహిద్ దర్గా అభివృద్ధి పనులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy), రాష్ట్ర ప్రభుత్వానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Nellore Rural MLA Kotamreddy Sridhar Reddy) అభినందనలు తెలియజేశారు. బరాషాహిద్ దర్గా అభివృద్ధి, మసీదు నిర్మాణం కోసం రూ.15 కోట్లు నిధులు కేటాయిస్తూ జీవో జారీ చేసి జాప్యం చేశారన్నారు. 9 నెలలు అయినా ఆర్ధిక శాఖ అనుమతులు లేవని నిలిపేశారని... 6 నెలల పాటు ప్రభుత్వం పెద్దల చుట్టు తిరిగినట్లు తెలిపారు. నాలుగు సార్లు టెండర్లు పిలిచినా ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలేదన్నారు. వారం రోజుల నుంచి ప్రత్యేక కార్యక్రమం చేపట్టామని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో దర్గా కోసం ఉద్యమం చేపడితే నెరవేరుతుందని శ్రీకారం చుట్టామని.. తమ ప్రయత్నంతో విజయం సాధించామన్నారు. రాత్రి దర్గా అభివృద్ధి పనులకు ఆర్ధిక శాఖ అనుమతులు ఇచ్చిందన్నారు. ఇది తన విజయం కాదని నెల్లూరు ముస్లిం సోదరుల పోరాటమని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.

అధికార పక్షమా, ప్రతిపక్షమా అని కాదని... సంకల్పం ఉంటే ఏదైన సాధ్యం అవుతుందని అన్నారు. సీఎం పొట్టేపాలెం కలుజుపై కూడా స్పందించాలని కోరారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సమస్యలకి నిధులు మంజూరు చేయాలని, జగనన్న కాలనిలో కనీస వసతుల కల్పన చేయాలని డిమాండ్ చేశారు. గణేష్ ఘాట్‌కు సంబంధించిన రూ.16 కోట్లు కేంద్ర నిధులు వెనక్కిపోకుండా చొరవ తీసుకోవాలన్నారు. ఎన్నికల వేళ మాత్రమే జండాలు, అజెండాల అని.. మిగిలిన సమయంలో ప్రజా సమస్యలే అని స్పష్టం చేశారు. నెల్లూరు రూరల్ సమస్యలపై రేపటి నుంచి మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-04-14T12:01:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising