ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Somireddy: నెల్లూరు జిల్లాలో అతపెద్ద కుంభకోణం..

ABN, Publish Date - Dec 19 , 2023 | 09:31 AM

నెల్లూరు: దేశంలోనే అతపెద్ద కుంభకోణం నెల్లూరు జిల్లాలో జరుగుతుందని రూ.వేల కోట్ల ఖనిజాలను దోచేస్తున్నారని, సీఎం జగన్ శ్రీమతి భారతికి ముడుపులు పంపాలని బహిరంగంగా చెబుతున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

నెల్లూరు: దేశంలోనే అతపెద్ద కుంభకోణం నెల్లూరు జిల్లాలో జరుగుతోందని రూ.వేల కోట్ల ఖనిజాలను దోచేస్తున్నారని, సీఎం జగన్ శ్రీమతి భారతికి ముడుపులు పంపాలని బహిరంగంగా చెబుతున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. మూడు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తుంటే అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, హిజ్రాలు, వైసీపీ గూండాలను పంపి లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించారని చెప్పారు. ఇంత దిగజారడం ఎన్నడూ చూడలేదన్నారు. ఆధారాలతో సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే దిక్కులేదని, ఉద్యమం ఇంతటితో ఆపేదిలేదని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున జెలిటిన్ స్డిక్స్, డిటోనేటర్ల డంప్‌ను చూపినా అధికారులు స్పందించలేదని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. మూడు రోజులుగా వరదాపురంలో అక్రమ క్వారీ తవ్వకాల ప్రాంతంలో సోమిరెడ్డి దీక్ష చేస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో సోమిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఆపై వాహానాల్లో ఆయనను ఇంటికి తరలించారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న ప్రాంతానికి సుమారు 200 మంది హిజ్రాలు, వైసీపీ గూండాలను అక్రమార్కులు పంపారు. క్వారీలో ఉన్న భారీ యంత్రాలు, వాహానాలను బయటకి పంపేయత్నం చేశారు. అయితే టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వివాదాలు జరిగి.. ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను బయటకి పంపారు. వైసీపీ గూండాలకు పోలీసులు సపోర్టు చేశారు. జగన్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Dec 19 , 2023 | 09:31 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising