ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP: సమయం ఆసన్నమైందన్న అచ్చెన్న

ABN, First Publish Date - 2023-04-19T15:18:43+05:30

టీడీపీ పుట్టి 40 ఏళ్లు పూర్తి చేసుకుందని, బీసీలకి అనేకమైన పథకాలు ఇస్తూ ముందుకు సాగిందని అచ్చెన్నాయుడు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: ‘‘సమయం ఆసన్నమైంది.. ప్రతి ఒక్కరు నడుంబిగిద్దాం.. హక్కులను కాపాడుకుందాం’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu) పిలుపునిచ్చారు. బుధవారం బీసీల అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... టీడీపీ (TDP) పుట్టి 40 ఏళ్లు పూర్తి చేసుకుందని, బీసీలకు అనేకమైన పథకాలు ఇస్తూ ముందుకు సాగిందని తెలిపారు. ఏపీలో (AP) దాదాపు 140 కులాలు ఉన్నప్పటికీ, మరికొన్ని కులాలు వెనుకబడి ఉన్నాయన్నారు. దేశ, రాష్ట్ర జనాభాలో అత్యధికంగా బీసీలే ఉన్నారని అన్నారు. ఐకమత్యం లేనందున ఎదగలేకపోతున్నామని తెలిపారు. పార్టీలు, మనుషులు వేరైనా అందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు. బలహీన వర్గాలు ఎదగాలన్నదే చంద్రబాబు (Chandrababu Naidu) నినాదమని ఆయన చెప్పుకొచ్చారు.

ప్రతి జిల్లాలో సెంట్రల్ స్ధలాలో బీసీ భవనాలు ఇచ్చామని.. ఈ ప్రభుత్వంలో ఒక్క భవనం కట్టలేదని విమర్శించారు. బలహీన వర్గాలు ఎప్పుడూ టీడీపీ (TDP) వైపే ఉంటారని... అందుకే జగన్‌కు బలహీనవర్గాలంటే కోపమన్నారు. 54 కార్పోరేషన్లు ఇచ్చామంటారని.. ఇప్పటి వరకు ఒక్కపైసా కూడా నిధులివ్వలేరని మండిపడ్డారు. సైకో జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. పదిమంది మంత్రలని ఇచ్చామని గొప్పగా చెబుతున్నారని.. ఎందుకా మంత్రులని ప్రశ్నించారు. ఎన్టీఆర్ రాజకీయంగా అవకాశం ఇచ్చారని, చంద్రబాబు బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించారని తెలిపారు. అయితే జగన్ మాత్రం బీసీ రిజర్వేషన్‌ను 34 నుంచి 24 శాతం చేసి మోసం చేశారని అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-04-19T15:20:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising