ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Devineni Uma: జగన్ ఆజ్ఞ లేనిదే సజ్జల లాంటి వారు కొట్టిస్తారా?

ABN, First Publish Date - 2023-06-05T13:43:58+05:30

సీఎం జగన్ అవినీతి, అసమర్ధతని నెల్లూరు యాసలో ఆనం చక్కగా మాట్లాడుతున్నారని.. తామంతా ఆనంను చూసి గర్వపడుతున్నామని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: సీఎం జగన్ (AP CM YS Jaganmohan reddy) అవినీతి, అసమర్ధతని నెల్లూరు యాసలో ఆనం చక్కగా మాట్లాడుతున్నారని.. తామంతా ఆనంను చూసి గర్వపడుతున్నామని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు (TDP Leader Devineni Umamaheshwar rao) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆనం కుటుంబం ఎన్నో రాజకీయ పదవులు చేపట్టిందన్నారు. తాడేపల్లి ఆలోచనలు ఎలా ఉన్నాయో ప్రజలే అర్ధం చేసుకోవాలని అన్నారు. జగన్ ఆజ్ఞ లేనిదే సజ్జల లాంటి వారు కొట్టిస్తారా?.. పార్టీ కార్యాలయాలపై దాడులకి కూడా సజ్జలే కారణమని ఆరోపించారు. చంద్రబాబుపై (TDP Chief Chandrababu Naidu) దాడి చేసిన వారికి మంత్రి పదవి ఇచ్చారని.. సీఎం జగన్ కళ్లలో పైశాచిక ఆనందం చూడటానికి సజ్జలే దాడి చేయించారని మండిపడ్డారు. ఒక రాజకీయ కుటుంబం, 42 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ... ఇలా ఎంత మందిపై దాడులు చేయిస్తారని ప్రశ్నించారు. జగన్ పిచ్చి పరాకాష్ఠకి వెళ్లిందన్నారు. ఈ చంపించడం, దాడుల కార్యక్రమాలు ఏమిటని నిలదీశారు. ఆనంపై దాడి జరిగి 24 గంటలు గడుస్తోందని... ఇప్పటికీ పోలీసులు ఎఫ్ఐఆర్ ఇవ్వలేదన్నారు. ఒకప్పుడు బీహార్‌లో ఇలాంటి సంఘటనలు చూస్తుండేవారమని.. ఇప్పుడు వారు కూడా అభివృద్ధిలో ముందుకు వెళుతున్నారని తెలిపారు. ఆనంపై దాడి జరిగితే మంత్రి కాకాణికి బాధ్యత లేదా? సుపారీ ఎవరిచ్చారు? గంజాయి బ్యాచ్ ని ఎవరు పంపించారు? మొత్తం విచారణ జరిపించాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.

Updated Date - 2023-06-05T13:43:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising