ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YuvaGalam: జగన్ పాలనలో మ్యాటర్ వీక్... పబ్లిసిటీ పీక్ అన్న లోకేష్

ABN, First Publish Date - 2023-06-27T16:43:23+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. ప్రస్తుతం గూడూరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. ఈరోజు తాడిమేడు క్యాంపు సైటు నుంచి 139రోజు పాదయాత్రను లోకేష్ మొదలుపెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. ప్రస్తుతం గూడూరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. ఈరోజు తాడిమేడు క్యాంపు సైటు నుంచి 139రోజు పాదయాత్రను లోకేష్ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా తాడిమేడు క్రాస్ క్యాంప్ సైట్ వద్ద మత్స్యకారులతో ముఖాముఖి సమావేశంలో యువనేత పాల్గొన్నారు. లోకేష్‌ ముందు మత్స్యకారులు తమ సమస్యలను ఏకరువుపెట్టారు. జీఓ 217 తీసుకొచ్చి తమ పొట్ట కొట్టారని.. ఎన్నో ఏళ్లుగా జీవనోపాధిగా ఉన్న తమ చెరువులు లాక్కున్నారని వాపోయారు. పులికాట్ సరస్సు ముఖద్వారం వద్ద పూడిక తియ్యకపోవడం వలన చేపలు పట్టుకోవడానికి వీలులేక ఇబ్బంది పడుతున్నామన్నారు. తమిళనాడు జాలర్లు దాడులు చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం రక్షణ కల్పించడం లేదని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో బోట్లు, వలలు ఇచ్చే వారు ఇప్పుడు జగన్ ప్రభుత్వం (Jagan Government) ఎటువంటి సహాయం అందించడం లేదని చెప్పారు. డ్రైయింగ్ ప్లాట్ ఫామ్‌లు లేక ఇబ్బంది పడుతున్నామన్నారు. జగన్ పాలనలో తుఫాను షెల్టర్లు ఏర్పాటు చెయ్యకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. టీడీపీ హయాంలో మత్స్యకారులు చనిపోతే రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందేదని.. జగన్ పాలనలో మత్స్యకారులు చనిపోతే భీమా అందడం లేదని గూడూరు నియోజకవర్గం మత్స్యకారులు వెల్లడించారు.

లోకేష్ మాట్లాడుతూ... జగన్ పాలనలో మ్యాటర్ వీక్... పబ్లిసిటీ పీక్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఫిష్ ఆంధ్రా అని హడావిడి చేసి ఫినిష్ ఆంధ్రా చేశారని విమర్శించారు. మత్స్యకారుల పొట్ట కొడుతూ జగన్ తెచ్చిన జీఓ 217ను టీడీపీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. పులికాట్ సరస్సు సమస్యపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. తమిళనాడు జాలర్లు దాడులు చేస్తుంటే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే మత్స్యకారులను కుక్కలతో పోల్చి తిడితే జగన్ కనీసం ఎమ్మెల్యేను పిలిచి మందలించే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే పులికాట్ సరస్సు ముఖద్వారం వద్ద పూడికతీస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ (TDP) అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రైయింగ్ ప్లాట్ ఫామ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. అధికారంలోకి రాగానే తమిళనాడు సీఎంతో చర్చలు జరిపి జాలర్ల సమస్యని శాశ్వతంగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఇతర రాష్ట్రాల వారు ఇటు వేటకు రాకుండా నియంత్రిస్తామన్నారు. 16 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో ఏపీ ప్రయాణం మొదలు అయ్యిందని.. అయినా ఏ వర్గానికి లోటు లేకుండా అందరికీ చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) న్యాయం చేశారని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో ఏపీని మత్స్యకారప్రదేశ్‌‌గా మార్చామని.. ఆక్వా ఎగుమతుల్లో చంద్రబాబు ఏపీని నంబర్ 1గా చేశారని ఆయన తెలిపారు.

ప్రభుత్వం మత్స్యకారులకు సహాయం అందించాలని.. అది మానేసి ఫిష్ ఆంధ్రా అంటూ హడావిడి చేశారని అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక విధాలుగా మత్స్యకారులను ఆదుకున్నామని చెప్పారు. ఐదేళ్లలో రూ.800 కోట్లు మత్స్యకారుల సంక్షేమం కోసం ఖర్చు చేశామని, 50 ఏళ్లకే మత్స్యకారులకు పెన్షన్లు ఇచ్చామని తెలిపారు. మత్స్యకార పిల్లలు చదువు కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశామన్నారు. సబ్సిడీలో బోట్లు, వలలు, డీజిల్, టీవీఎస్ బల్లు అందజేశామన్నారు. వేట విరామ సమయంలో భృతి ఇచ్చి ఆదుకున్నామని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు మత్స్యకారులకు ఇచ్చిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను జగన్ రద్దు చేశారని మండిపడ్డారు. జీఓ.30 తీసుకొచ్చి మత్స్యకారులకు వచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారన్నారు. ఎన్నో ఏళ్లుగా మత్స్యకారుల జీవనోపాధిగా ఉన్న చెరువులు లాక్కొని వారికి జగన్ (AP CM YS Jaganmohan Reddy) తీరని అన్యాయం చేశారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కార్పొరేషన్ ద్వారా దామాషా ప్రకారం నిధులు కేటాయించి మత్స్యకారులను ఆదుకుంటామని చెప్పారు. టీడీపీ హయాంలో ఆక్వా రీసెర్చ్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని... మత్స్య సంపద పెంచడానికి ప్రతి ఏడాది చేప పిల్లలు పెద్ద ఎత్తున చెరువుల్లో, రిజర్వాయర్లలో వదిలిపెట్టామని గుర్తుచేశారు. మత్స్యకారుల కోసం తీర ప్రాంతంలో తుఫాను షెల్టర్లు ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. టీడీపీ హయంలోనే చంద్రన్న భీమా పథకం తీసుకొచ్చామని.. జగన్ వైఎస్సార్ భీమా అని పేరు మార్చి ఆయనకి చెడ్డ పేరు తెచ్చారని మండిపడ్డారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామన్నారు. ఆదరణ పథకం ద్వారా మత్స్యకారులకు అవసరమైని అన్ని పనిముట్లు అందజేస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు.

Updated Date - 2023-06-27T16:47:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising