ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Somireddy Chandramohan reddy: నీ ప్రమాణాలతో నువ్వు సచ్చీలుడివి అయిపోతావా... అనిల్

ABN, First Publish Date - 2023-07-06T16:38:14+05:30

టీడీపీ యువనేత నారా లోకేశ్‌కు ఎమ్మెల్యే అనిల్ కుమార్ సవాల్‌లు విసరడంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: టీడీపీ యువనేత నారా లోకేశ్‌కు (TDP Leader Nara Lokesh) ఎమ్మెల్యే అనిల్ కుమార్ (MLA Anil kumar) సవాల్‌లు విసరడంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ లోకేశ్‌ను ప్రమాణాలకు రమ్మంటున్నారు. నీ ప్రమాణాలతో నువ్వు సచ్చీలుడివి అయిపోతావా... అనిల్... నువ్వు నిజాయితీపరుడివి అయితే సీబీఐ ఎంక్వైరీ వేయించుకోవాలి. ఎన్నికలకు ముందు చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించి భంగపడ్డారు. లోకేశ్‌ ఆరోపించిన వాటిపై మీ నిజాయితీని మీరు నిరూపించుకోండి. మంత్రి కాకాణి, అనిల్ సీఎం దగ్గర సీబీఐ ఎంక్వైరీ కోరాలి. విచారణలో మీ నిజాయితీ ఏమిటో తేలుతుంది’’ అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

సోమిరెడ్డి ఇంకా మాట్లాడుతూ.. నెల్లూరు రూరల్ మండలం కందమురు గ్రామ దళితుడి హత్య కేసుపై జాతీయ మానవ హక్కుల సంఘం కదిలిందని తెలిపారు.జనవరి 2023లో జిల్లా కలక్టర్, ఎస్పీలని సమాధానం కోరారని.. స్పందించక పోవడంతో ఆగస్ట్ 25 స్వయంగా హాజరు కావాలని సమన్లు జారీ చేసిందని చెప్పారు. టీడీపీ పోరాటం ఫలితంగా నారాయణ కుటుంబానికి న్యాయం జరిగిందన్నారు. ఎస్సై కరిముల్లపై ఫిర్యాదు ఉన్నా చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. నారాయణ హత్య కేసులో ఏ1గా మంత్రి కాకాణి, ఏ2గా ఎస్పీ, ఏ3గా పోస్టుమార్టం రిపోర్టు మార్చిన డాక్టర్‌ను చేర్చాలని డిమాండ్ చేశారు. ఆపదలో అండగా నిలిచినందుకు తనతో పాటు సుబ్బానాయుడు, బీద రవిచంద్రలపై క్రిమినల్ కేసులు పెట్టారన్నారు. ఏపీలో సీఆర్పీసీ పోయి వైసీపీసీ కోడ్ అమలు అవుతుందన్నారు. ఇద్దరు ముస్లింలని, ఒక దళితుడిని చంపిన ఎస్ఐని మంత్రి కాకాణి కాపాడుతూ తన దగ్గరే పెట్టుకున్నారని తెలిపారు. కావలిలో దళితుడు హత్య కారకులైన వారిని అరెస్ట్ చేసిన సీఐని ఎస్పీ ట్రాన్స్ఫర్ చేశారని సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-07-06T17:44:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising