ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gannavaram పోలీస్ స్టేషన్‌లోనే పట్టాభి

ABN, First Publish Date - 2023-02-22T08:31:21+05:30

టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి, చిన్నా, జాస్తిలపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌తో సహా పలు సెక్షన్‌ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మొత్తం 14 మందిని పోలీసులు గన్నవరం కోర్టులో హాజరుపరిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ : టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి, చిన్నా, జాస్తిలపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌తో సహా పలు సెక్షన్‌ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మొత్తం 14 మందిని పోలీసులు గన్నవరం కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి పట్టాభికి రిమాండ్ విధించారు. అయితే పట్టాభిని పోలీసులు కొట్టారని ఆయన తరపున న్యాయవాది.. జడ్జికి వివరించారు. అయితే ఆసుపత్రిలో పరీక్షలు చేయించి‌ నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఆదేశాలతో పట్టాభిని గన్నవరం పోలీస్టేషన్‌లో పోలీసులు ఉంచారు. మిగిలిన వారిని గన్నవరం సబ్ జైలుకు తరలించారు. ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నివేదిక కోర్టుకు అందనుంది. పట్టాభిని నేడు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. రాజమండ్రి సెంట్రల్ ‌జైలుకు తరలించే అంశంపై నేడు స్పష్టత రానుంది.

అసలేం జరిగిందంటే..

పట్టాభిరాంను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని.. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు పోలీసు స్టేషన్లో తన ముఖానికి టవల్‌ చుట్టి ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా కొట్టారని ఆయన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. వైద్య పరీక్షలకు ఆదేశించిన న్యాయమూర్తి.. ఆయనకు 14 రోజులపాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. కరుడుగట్టిన నేరస్థుల విషయంలోనూ ప్రవర్తించని విధంగా పోలీసులు తమ ప్రతాపాన్ని పట్టాభిపై చూపారు. అరెస్టు చేసే విషయంలో నిబంధనలకు తూట్లు పొడిచారు. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో గన్నవరంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చూపితే వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని.. అనధికారికంగా ఆయన కారులోనే తీసుకెళ్లారు. డ్రైవర్‌ను, పీఏను, ప్రైవేటు భద్రతా సిబ్బందిని పక్కకునెట్టేశారు. కారుకు ముందు, వెనుక నాలుగైదు వాహనాలను పెట్టి గన్నవరం నుంచి తరలించారు. ఎక్కడకు తీసుకెళ్తున్నారో చెప్పకుండా అత్యంత రహస్యంగా ఉంచారు. సమాచారం ఎక్కడా లీక్‌ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రాత్రంతా ఒకచోట నుంచి మరోచోటకు తిప్పారు.

Updated Date - 2023-02-22T08:31:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising