ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Assembly Budget Session: అసెంబ్లీ లాబీల్లో పయ్యావుల, పేర్ని నాని ఆప్యాయంగా పలకరించుకున్నట్టు అనిపించినప్పటికీ..

ABN, First Publish Date - 2023-03-14T13:26:00+05:30

సెంబ్లీ లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి పేర్ని నాని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య చిట్ చాట్ జరిగింది. పైకి చూసేందుకు ఇది బాగానే అనిపించినా కూడా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి : అసెంబ్లీ లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (Payyavula Keshav), మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య చిట్ చాట్ జరిగింది. పైకి చూసేందుకు ఇది బాగానే అనిపించినా కూడా ఒకరకంగా వారిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగిందనే చెప్పాలి. నవ్వుకుంటూనే ఇద్దరూ పరోక్ష కౌంటర్‌లు విసురుకున్నారు. ఎలా ఉన్నారంటే.. ఎలా ఉన్నారంటూ పరస్పరం పలకరించుకున్నారు. మళ్లీ కేశవ్ గెలవాలని కోరుకుంటున్నానని పేర్ని నాని తెలిపారు. ఉరవకొండలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రాదన్న సెంటిమెంటును గుర్తు చేస్తూ పేర్ని నాని ఈ కామెంట్ చేశారు. నో డౌట్ 1994 ఫలితాలు.. 2024లో రిపీట్ అవుతాయని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.1994లో ఉరవకొండలో టీడీపీ గెలిచింది అలాగే.. పార్టీ అధికారంలోకి వచ్చిందనే రీతిలో పయ్యావుల వ్యాఖ్యలు చేశారు.

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget Sessions) మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ Governor Abdul Nazir) ప్రసంగాన్ని మొదలుపెట్టారు. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల కోసం సీఎం పాలన సాగుతోందన్నారు. సమీకృత అభివృద్ధి కోసం పారదర్శక పాలన అందిస్తున్నామని తెలిపారు. ఏపీ (AP) లో నవరత్నాలతో సంక్షేమ పాలన జరుగుతోందని గవర్నర్‌ నజీర్‌ పేర్కొన్నారు. డీబీటీ ద్వారా అవినీతి లేకుండా లబ్దిధారులకే సొమ్ము అందజేస్తున్నామన్నారు. గ్రామ సచివాలయాలతో ప్రజల దగ్గరకే పాలన అందిస్తున్నామని తెలిపారు. 45 నెలల్లో 1.97 లక్షల కోట్ల నగదు ప్రజలకి చేరిందన్నారు. లబద్ధిదారుల గుర్తింపుకోసం వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చినట్లు చెప్పారు.

Updated Date - 2023-03-14T13:49:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising