ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైకో పాలన పోయి సైకిల్ పాలన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది: పోలవరం టీడీపీ కన్వీనర్

ABN, First Publish Date - 2023-04-07T07:03:56+05:30

వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వలన రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయిందని పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురం మండలం, బంధంచర్ల పంచాయతీలో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పోలవరం : వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వలన రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయిందని పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురం మండలం, బంధంచర్ల పంచాయతీలో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బంధం చర్ల గ్రామస్తుల వద్దకు వెళ్లి జగన్ నిర్ణయాల వల్ల రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో వివరించి 15 అంశాలపై వారి వద్ద నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు. సైకో పాలన పోయి సైకిల్ పాలన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు. అనుభవం ఉన్న నాయకుడు, అభివృద్ది చేయగలిగిన నాయకుడు చంద్రబాబు మాత్రమేనని శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి జయవరపు శ్రీరామ్మూర్తి, మండల పార్టీ అధ్యక్షులు నాయుడు రామకృష్ణారావు గౌడ్, మండల పార్టీ ఉపాధ్యక్షులు సిద్దా శ్రీను, యువరాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు కాసనేని మాధవరావు, ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోట్టా రామారావు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు పిన్నమనేని మధు, పెద్దిన సత్యనారయణ, మాజీ సోసైటి అధ్యక్షులు బొంతు సత్యనారయణ, ఆచంట సూర్యనారాయణ, కాసనేని వెంకట్రావు, ఘంటా సతీష్, జొనుబోయిన సొంబాబు, పెద్దిన చంద్రశేఖర్, బండివారిగూడెం గ్రామ పార్టీ అధ్యక్షులు మూర్తి రావు, గండబోయిన వెంకట్రావు, శీలం రామారావు, పి. శ్రీను, బిసి సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండపల్లి రవి, మొడియం సింగరాజు, పసుమర్తి భీమేశ్వరరావు, ఘంటా అఖిల్, పొలగాని నాగేంద్ర, మనెల్లి బాలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-07T07:05:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising